పుష్ప సినిమాకి దేశవ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్ చూసి అంతా నివ్వెర పోయారు. ఇప్పుడు పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా కూడా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంది అనే వార్త బయటకు వచ్చింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా బన్నీ రేంజ్ ఆకాశాన్ని తాకింది. బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా అల్లు అర్జుని ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఇప్పుడు పుష్ప-2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. అయితే సుకుమార్ కూడా సినిమా పనులు శరవేగంగానే పూర్తి చేస్తున్నారు. అనుకున్న సమయానికే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 సినిమా గురించి ఎక్కువ బజ్ నడుస్తోంది. ఇప్పుడు నెట్టింట ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదే పుష్ప-2లో ఐటమ్ సాంగ్ గురించి.
పుష్ప సినిమాకి దేశవ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప-2 సినిమాపై అంతకు మించిన అంచనాలు, అకాంక్షలు ఉన్నాయి. అందుకే పుష్ప-2 మూవీ విషయంలో సుకుమార్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ ఉంటుందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అందుకు సీరత్ కపూర్ పెట్టిన ఒక పోస్ట్ కారణంగా చెప్పవచ్చు. అల్లు అర్జున్ గు టైట్ హగ్ ఇచ్చిన ఒక ఫొటోని సీరత్ కపూర్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్టే చేసింది. దానికి క్యాప్షన్ గా “డాన్సర్స్ కి ఎగిరేందుకు రెక్కలు అక్కర్లేదు.. వారి ఎనర్జీనే లీడ్ చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది.
#Pushpa2TheRule Begins!!! pic.twitter.com/FH3ccxGHb8
— Allu Arjun (@alluarjun) April 7, 2023
ఇప్పుడు ఈ పోస్ట్ గురించే నెట్టింట చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 తప్ప మరే సినిమా చేయడం లేదు. సీరత్ కపూర్ కి కూడా టాలీవుడ్ లో సినిమాలు ఏమీ లేవు. ఈ నేపథ్యంలోనే సీరత్ కపూర్ పుష్ప-2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతోంది అనే కంక్లూజన్ కి వస్తున్నారు. అయితే ఈ పోస్టుని బట్టి.. ఆమె సినిమాలో సాంగ్ చేస్తోంది అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఎక్కువగా ఎండార్స్ మెంట్లు కూడా చేస్తుంటాడు. ఒకవేళ ఈ డాన్స్ అందుకోసం కూడా కావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పుష్ప-2 సినిమా ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Dancers don’t need wings to fly! Their energies lead. Those who know. Know.
@alluarjun 💕🕺💃 pic.twitter.com/jB04MWTe0a
— Seerat Kapoor (@IamSeeratKapoor) May 8, 2023