ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విరూపాక్ష సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. డైరెక్టర్ గా కార్తిక్ వర్మ దండుకి, హీరోగా సాయి ధరమ్ తేజ్ కు ఇది బిగ్గెస్ట్ హిట్ గా చెప్పచ్చు. మరోవైపు ఈ సినిమాతో సంయుక్త మీనన్ కూడా టాలీవుడ్ లో లక్కీ చామ్ గా పేరు తెచ్చుకుంది.
‘విరూపాక్ష’ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలచిన విషయం తెలిసిందే. గతవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తంది. ఇప్పటికే లాభాల బాట పట్టిన విరూపాక్ష.. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ కూడా మంచి హిట్ అందుకున్నాడు. ముఖ్యంగా ఈ మూవీ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. సుకుమార్ శిష్యుడు అయిన కార్తిక్ వర్మ దండు ఈ సినిమాతో డైరెక్టర్ గా తనని తాను నిరూపించుకున్నాడు. స్క్రీన్ ప్లే ఇచ్చింది సుకుమార్ అయినా కూడా.. డెరెక్టర్ గా కార్తిక్ వర్మ దండుకు మంచి మార్కులు పడ్డాయి. సాధారణంగా సినిమా హిట్ అయితే డైరెక్టర్ కు నిర్మాత ఖరీదైన గిఫ్టులు ఇస్తుంటారు. కానీ, ఇక్కడ మాత్రం డైరెక్టర్ కు హీరోయిన్ గిఫ్ట్ ఇచ్చింది.
టాలీవుడ్ లో మాత్రమే కాదు.. ఏ సినిమా ఇండస్ట్రీ అయినా ఒక డైరెక్టర్ మంచి హిట్ ఇస్తే నిర్మాత గిఫ్టులు ఇస్తుంటారు. ఈ సినిమాలో డైరెక్టర్ కు హీరోయిన్ సంయుక్త మీనన్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. స్వయంగా హీరోయిన్ సంయుక్త వెల్లడించింది. ఈ సినిమా విడుదల రోజు చిత్ర బృందం మొత్తం సినిమా చూసేందుకు ఒక థియేటర్ కు వెళ్లింది. ఆ సమయంలో డైరెక్టర్ ఫోన్ ని ఎవరో దొంగిలించారు. ఓ సందర్భంలో ఆ విషయాన్ని డైరెక్టర్ మీడియాతో పంచుకున్నారు. ఆ విషయం విని అందరూ అయ్యే అన్నారు. సంయుక్త మీనన్ మాత్రం డైరెక్టర్ కార్తిక్ వర్మ దండుకు వెంటనే ఐఫోన్ ప్రో మోడల్ ని గిఫ్టుగా ఇచ్చింది.
ఈ విషయంపై సంయుక్త మాట్లాడుతూ.. “విరూపాక్ష సినిమా హిట్ అయిన సందర్భంగా డైరెక్టర్ కార్తిక్ వర్మకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను. ఆ టైమ్ లోనే కార్తిక్ ఫోన్ పోయిందని తెలిసింది. వెంటనే ఐఫోన్ కొనిచ్చాను. కానీ, అతని సిమ్ వర్క్ చేయడానికి ఒక రోజు సమయం పట్టింది. ఒక రోజు మొత్తం మెసేజ్ లు, ఫోన్ కాల్స్ అన్నీ ఆగిపోయాయి. సోషల్ మీడియాలో కూడా సినిమా గురించి ఏం నడుస్తోంది అనేది తెలియకుండా పోయింది. క్రూలో ఉన్న వేరే వాళ్ల ఫోన్ ద్వారా డైరెక్టర్ సినిమా అప్ డేట్స్ తెలుసుకున్నారు” అంటూ సంయుక్త మీనన్ చెప్పుకొచ్చింది. హీరోయిన్ చేసిన పని తెలుసుకుని తెలుగు ప్రేక్షకులు ఆమెను తెగ పొగిడేస్తున్నారు. ఎక్కడా నిర్మాతలు గిఫ్టులు ఇస్తారు. కానీ, హీరోయిన్ డైరెక్టర్ కి గిఫ్ట్ ఇవ్వడం గొప్ప విషయం అంటూ కామెంట్ చేస్తున్నారు.