సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన విరూపాక్ష చిత్రం ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాలో తొలుత విలన్‌గా వేరే వారిని అనుకున్నారట. కానీ సుకుమార్ చేంజ్ చేసి సంయుక్తా మీనన్‌ను విలన్‌గా చేశారంట. ఈ విషయాలను దర్శకుడు కార్తీక్ దండు వివరించారు.
క్షుద్ర పూజల ఆధారంగా తెరకెక్కిన విరూపాక్ష సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచానాలు ఏర్పడ్డాయి. విడుదల తర్వాత విరూపాక్ష.. వాటిని సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అయ్యింది కూడా. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ఎవరూ ఊహించని రీతిలో భారీ విజయం సాధించింది. సినిమాలో రవి కిషన్, సంయుక్త మీనన్ పండించిన విలనీజానికి ప్రేక్షకులు బీభత్సంగా భయపడుతూనే సినిమాను భారీ సక్సెస్ చేశారు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ సక్సెస్ సాధించింది. రెండో ప్రయత్నంలోనే కార్తీక్ సాలిడ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. విరూపాక్ష ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. తాజాగా సినిమా దర్శకుడు కార్తీక్ దండి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. విరూపాక్ష సినిమాలో ప్రధాన విలన్ హీరోయిన్ సంయుక్త మీనన్. కానీ సినిమా కథ రాసుకున్నప్పుడు విలన్‌గా వేరే వ్యక్తిని అనుకున్నారంట. కానీ సుకుమార్ సూచన వల్ల.. చివరకు సంయుక్తను విలన్‌గా మార్చామని చెప్పుకొచ్చాడు. మరి కార్తీక్ ముందుగా విలన్ పాత్ర కోసం ఎవరిని అనుకున్నారు అంటే.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన యాంకర్ శ్యామల. అవును యాంకర్ శ్యామలను తొలుత ఈ చిత్రంలో విలన్‌గా అనుకున్నాడట కార్తిక్.
ఇక విరూపాక్ష సినిమాలో యాంకర్ శ్యామల.. సాయి ధరమ్‌తేజ్‌కు అక్క పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆమె మృతి తర్వాత సినిమా కీలక మలుపు తిరుగుతుంది. అప్పటి వరకు వీటిని సాధారణ మరణాలుగా భావిస్తుండగా.. శ్యామల మృతి తర్వాత వరుసగా చోటు చేసుకున్న మరణాల వెనక ఏదో బలమైన కారణం ఉందనే విషయం హీరోకు అర్థం కావడం.. ఆ దిశగా అన్వేషణ కొనసాగించగా.. అసలు విలన్‌లు వెలుగులోకి వస్తారు. అయితే సుకుమార్.. కార్తీక్ రాసుకున్న కథంతా విని.. స్క్రీన్ ప్లే చేంజ్ చేయడంతో పాటు హీరోయిన్ సంయుక్తా మీనన్ పాత్రను విలన్ చేసేశారు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో కార్తీక్ వర్మ దండు వెల్లడించారు.
దాంతో సుకుమార్ మార్పుల వల్లే ఈ చిత్రం భారీ విజయం సాధించిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో శ్యామల గనక విలన్ పాత్రలో నటిస్తే.. రవి కిషన్ పాత్రకు వచ్చినంత గుర్తింపు వచ్చి ఉండేది. పాపం శ్యామల మంచి చాన్స్ మిస్ అయ్యింది అంటున్నారు ఆమె అభిమానులు. మరి శ్యామల.. విలన్ పాత్రలో నటిస్తే.. సినిమా రిజల్ట్ ఎలా ఉండేదని మీరు భావిస్తున్నారో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.