పాము కాటేసినప్పుడు అది విషపూరితమైన పాము కాకపోతే పెద్దగా ఇబ్బంది ఉండదు. విషపూరితమైన పామైతే… క్షణక్షణం మృత్యువు తరుముకొస్తూ ఉంటుంది. ప్రాణాలు దక్కించుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలి. అలా చెయ్యాలంటే విషపూరితమైన పాము కాటు వేస్తే… వెంటనే మనలో ఎలాంటి మార్పులు వస్తాయో మనకు తెలియాలి.కాటు వేసిన ప్రదేశాన్ని జాగ్రత్తగా గమనించాలి.అక్కడ మనకు ఇంజెక్షన్ చేసినప్పుడు ఎలాగైతే… చర్మానికి చిన్న కన్నం పడుతుందో… అలాంటి రెండు కన్నాలు… పక్కపక్కనే పడి ఉంటాయి.ఆ రెండు కన్నాలూ ఉన్నాయంటే…ఆ పాముకి కోరలు ఉన్నట్లే.
అది విషపూరితమైన పామే అని తెలుసుకోవాలి.పాము కాటు వేసిన చోట నొప్పిగా ఉంటుంది.ఆ ప్రదేశంలో కొద్దిగా వాపు వస్తుంది.అలాగే… అది పాలిపోయినట్లుగా కలర్ లేకుండా తయారవుతుంది.అంతేకాదు ఊపిరి సరిగా ఆడదు. వికారంగా ఉంటుంది. హైబీపీ వస్తుంది. నరాల వీక్‌నెస్ ఉంటుంది. జ్వరంగా కూడా ఉంటుంది.కొన్ని పాములు కాటేసినప్పుడు అంబులెన్స్ వచ్చేలోపే ప్రాణం పోతుంది. కొన్నిసార్లు బతికే ఛాన్స్ ఉంటుంది. మరి అంబులెన్స్ వచ్చే లోపు ఏం చెయ్యాలో తెలిసుండాలి.
కాటేసిన చర్మ ప్రదేశాన్ని గమనించాలి. విషం బయటకు వచ్చేసేలా ఉంటే… జాగ్రత్తగా బయటకు తియ్యాలి. అంటే… లోపలి చర్మం దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి.నీరు, టీ, గ్రీన్ టీ వంటివి బాగా తాగాలి. వాటికి మన బాడీలోని విష వ్యర్థాల్ని తొలగించే శక్తి ఉంటుంది.శరీరాన్ని అటూ ఇటూ కదలకుండా ఉంచాలి. అందువల్ల విషం మరింత వేగంగా శరీరమంతా విస్తరించకుండా ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి. గుండె కొట్టుకునే వేగం పెరిగితే… విషం విస్తరించే వేగం కూడా పెరుగుతుంది.
కాబట్టి ఏమాత్రం టెన్షన్ పడకుండా ఉండాలి. టెన్షన్ పెరిగితే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.”ఏం కాదు… నాకేం కాదు… నేను చావను. బతికే ఉంటాను. ఏం పర్లేదు” అని మనసులో బలంగా మళ్లీ మళ్లీ అనుకోవాలి. తద్వారా టెన్షన్ తగ్గి… మైండ్ దృష్టి కాన్ఫిడెన్స్ వైపు మరలుతుంది.antihistamines అనే టాబ్లెట్ వేసుకోవాలి. లేదా… కార్డియాక్ మందులు కూడా వేసుకోవచ్చని నిపుణులు తెలిపారు.పాము కాటు వేసినప్పుడు అది ఏ పామో తెలుసుకుంటే మంచిది. తద్వారా సరైన ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది.
ఒకవేళ తెలియకపోతే… కాటు వేసిన ప్రాంతం ఎలా ఉందో, ఏయే లక్షణాలు కనిపిస్తున్నాయో తెలుసుకొని… తద్వారా ఏ రకం (vipers, kraits, and cobras) పాము కాటు వేసిందో డాక్టర్లు గుర్తించేందుకు ప్రయత్నిస్తారు.ప్రస్తుతం డాక్టర్లలో చాలా మంది యాంటీవెనమ్ (Antivenom) అనే మందును ఉపయోగిస్తున్నారు. దీన్ని 1895లో ఫ్రాన్స్ ఫిజీషియన్ ఆల్బెర్ట్ కాల్మెట్టే (Albert Calmette) తయారుచేశారు.
ఆయన ఇండియన్ కోబ్రా (నాగుపాము) కాట్ల నుంచి ప్రజలను కాపాడేందుకు దాన్ని తయారుచేశారు. దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఇది దాదాపు అన్ని రకాల పాము కాట్ల నుంచి మనుషుల్ని కాపాడుతోంది.ఇలా మాత్రం చెయ్యవద్దు. కాటేసిన చోట గాయాన్ని కోసి… విషాన్ని బయటకు తియ్యవద్దు. విషం పాకకుండా ఉండాలనే ఉద్దేశంతో గాయం చుట్టూ… టేపు లాంటిది (tourniquet) కట్టవద్దు. కాటేసిన చోట క్రీముల వంటివి రాయవద్దు. మద్యం, కాఫీ లాంటివి తాగవద్దు.
మన సినిమాల్లో పాము కాటెయ్యగానే… మరో వ్యక్తి… నోటితో ఆ భాగంలో పీల్చి… విషాన్ని ఉమ్మి వేసినట్లు చూపిస్తారు. ఇలా చేస్తే… విషం బయటకు పోతుందా అన్నదానిపై రకరకాల అభిప్రాయాలున్నాయి. కాటేసిన 15 నిమిషాలలోపు మాత్రమే ఇలా చెయ్యడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే విషం తీసే వ్యక్తికి అనుభవం కూడా ఉండాలి. అయినప్పటికీ ఇలా చెయ్యడం వల్ల 50 శాతం విషం మాత్రమే బయటకు వస్తుందంటున్నారు.
ఒకవేళ మిమ్మల్ని కాటు వేశాక పాము చనిపోతే… దాన్ని చేతులతో ముట్టుకోకుండా… జాగ్రత్తగా ఓ ప్లాస్టిక్ బ్యాగులో వేసి… పరిశోధన కోసం పంపాలి. కానీ దాదాపు ఇలా ఎప్పుడూ జరగదు. కాటు వేసిన పామును మనం చంపకపోతే… అది ప్రాణాలతో బతికి ఉండే అవకాశాలు 99.9 శాతం ఉంటాయి.