మనిషికి శరీర అవయవాల్లో ముఖ్యమైనవి ఏవైనా ఉంటే అది హృదయం. ఎందుకంటే మనిషి ఎన్నో రకాలుగా హృదయంతో స్పందిస్తుంటారు.. ఇది చాలా సున్నితమైనది. అందుకే ఎంతోమంది కవులు హృదయంపై పాటలు, కవితలు రాస్తుంటారు.
గుండె లేకుండా అసలు మానవ మనుగడనే లేదు. అలాంటిది ఓ మనిషి తన గుండెను మార్చి , ఆ గుండెను మ్యూజియంలో పెట్టి, ప్రజలకు సందర్శించే విధంగా అమర్చారు. వినడానికి ఇది వింతగా ఉంది కదా! కానీ ఇది నిజం. తాజాగా ఈ సంఘటన లండన్ లో చోటు చేసుకుంది.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
లండన్ లో ఉంటున్న ఓ మహిళ పేరు జెనిఫర్ సుట్టన్. ఆమెకు 22 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు నిర్భంద కార్డయోమయోపతి అనే వ్యాధి తో రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. డాక్లర్లను సంప్రదించగా ఆమెకు గుండె సంబంధిత వ్యాధి వచ్చిందని తెలిపారు. వెంటనే నేపథ్యంలో గుండె మార్పిడి తప్పకుండా చేసుకోవాలి అన్నారు. ఆమె గుండె మార్పిడి చేసుకోవడానికి హాస్పిటల్ కి వచ్చింది. కానీ అప్పుడు ట్రాన్స్ ప్లాంట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంచారు. ఆ సమయంలో జెనిఫర్ ఆరోగ్యం చాలా క్షీణించింది. అదృష్టం కొద్ది గుండెను దాతగా ఇవ్వడానికి ముందుకు ఎవరు రాలేదు. ఆతర్వాత కొద్ది గంటల తర్వాత ఆమెకు సరిపడే గుండెను దాత ఇవ్వటంలో ముందుకు రావడంతో తనకు హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేసి విజయవంతగా ఇంకొక గుండెను అమర్చారు. దాంతో ఆమె కొత్త జీవితాన్ని ఫ్రారంభం చేసింది. అలాగే వివాహం చేసుకొని ప్రశాంతంగా ఉంటుంది. అయితే జెనిఫర్ పాడయిన హృదయాన్ని తీసేయకుండా అప్పటి నుంచి హంటేరియన్ మ్యూజియ లో ఉంచి వచ్చి పోయే వాళ్లకు ప్రదర్శనకు పెట్టారు.
16 సంవత్సరాల తర్వాత జెనిఫర్ సుట్టన్ తన హృదయాన్ని చూసుకోవడానికి వచ్చింది. చూసి ఇది నిజమేనా అంటూ ఆశ్ఛర్యపోయింది. ఇలా తన గుండెను ప్రదర్శనకు పెట్టడం, దానిని తాను స్వయంగా చూడడం నాకు గొప్ప వరం అంటూ వ్యక్తం చేసింది. అయితే జెనిఫర్ కథ విని అవయవ దానం గురించి ఆలోచించి,మరింత మందికి ప్రేరేపించేలా, వాళ్ల ప్రాణాలను రక్షించటంలో కూడా సహాయపడేలా చేస్తానని చెప్పింది. అవయవ దాన ప్రాముఖ్యత గురించి చాలా మందికి అవగాహన కల్పించేలా, ఇలాంటి ప్రదర్శన ద్వారా మరింత మంది వ్యక్తులకు అవయవదాతలుగా మార్చాలని, ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని అని చెప్పవచ్చు. మన దేశంలో కూడా నిత్యం రోడ్డూ ప్రమాదాల్లో వందల మంది చనిపోతున్నారు. బ్రెయిన్ డెడ్ అవుతున్న వారు ఉన్నారు. అలాగే ఇతర కారణాలతో చనిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. వారు ఎలాగో బతికే అవకాశం లేనందున.. కనుక వారి అవయవాల్ని ఇతరులకు దానం చేయడం ద్వారా మనం ఎన్నో కుటుంబాలకు మేలు చేసినట్లు అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇంతకన్నా గొప్పదానం ఏముంటుందని ప్రజలకు అన్ని విధాల అవగాహన కల్పించేలా మనం కృషి చేయాలి.