హెల్మెట్ పెట్టుకోకపోతే మాకేటి? అనేది బూతు మాట. టూవీలర్ నడిపేటప్పుడు తలకి హెల్మెట్ పెట్టుకోవాలి కదండీ. అది పెట్టుకోరా? పెట్టుకోకుండా రోడ్డెక్కడం ఏమిటండి? ఎందుకండీ ఇలాంటి వాళ్ళు. ఎందుకు పుడతారో కూడా తెలియదు. ట్రాఫిక్ పోలీస్ ఫైనేస్తే హర్ట్ ఐపోతారు. ఏ వాహనమో గుద్దితే హాస్పిటల్ లో పోయి పడతారు. చూడండి సార్ అక్కడ ఏమైందో.
ద్విచక్ర వాహనదారులు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అని పోలీసులు మొత్తుకుంటున్నా గానీ కొందరు వినడం లేదు. ఇంకా హెల్మెట్లు లేకుండానే రోడ్ల మీదకు వస్తున్నారు. దానికి తోడు పైగా ర్యాష్ డ్రైవింగ్ ఒకటి. ఇంకొందరైతే ఫోన్ మాట్లాడుతూనే నడిపేస్తుంటారు. అంత బిజీ ఏంటో అర్థం కాదు. ఏదో పది, 15 కంపెనీలకు సీఈఓ అన్నట్టు.. నిమిషం మాట్లాడకపోతే వేల కోట్లు నష్టపోతారన్నట్టే ఫీలైపోతుంటారు. బైక్ మీద వెళ్తూ మెడ పక్కకి వంచేసి మరీ ఫోన్ మాట్లాడతారు. ఒక పక్కకు ఆపి మాట్లాడాలన్నా జ్ఞానం ఉండదు. మరీ ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా? నిర్లక్ష్యం కారణంగా అవతల వ్యక్తికి నష్టం జరగొచ్చు, అతన్నే నమ్ముకున్న కుటుంబం అన్యాయం అయిపోవచ్చు. కానీ అవేమీ ఆలోచించకుండా.. బుర్రని ఇంట్లో పెట్టేసి వచ్చేస్తారు. ఇంకేముంది ఏదో వాహనం గుద్దితే రోడ్డు మీద పడతారు. నిర్లక్ష్యంగా నడిపిన వారు, అతని కుటుంబ సభ్యులు. రోజూ ఇలాంటి ప్రమాదాలు చూస్తున్నా గానీ మనిషిలో మార్పు అనేది రావడం లేదు.
తాజాగా ఒక యువకుడు నెత్తిన హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా బండి నడుపుతున్నాడు. ఒక స్కూల్ బస్సు ఒక వైపు నుంచి రోడ్డు మీదకు మలుపు తీసుకుని వస్తుంది. స్కూటీ మీద వస్తున్న యువకుడు ఆ స్కూల్ బస్సుని ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశాడు. కనీసం అవతల నుంచి ఏ వాహనం వస్తుందో కూడా అంచనా వేసే స్థితిలో లేకుండా నిర్లక్ష్యంగా, కేర్ లెస్ గా వేగంగా పోనిచ్చాడు. అవతల నుంచి ఒక కారు స్కూటీని ఢీకొనడంతో యువకుడు రోడ్డు మీద పడ్డాడు. స్కూటీ మీటర్ ఎత్తున గాల్లో లేచి కొంచెం దూరంలో పడింది. ఈ ఘటన కర్ణాటకలోని ముడ్బిద్రిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్కూటీ తునాతునకలు అవ్వగా.. యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. యువకుడు పైకి లేవలేక రోడ్డు మీద అలానే కూర్చుని ఉండిపోయాడు. లేవలేని స్థితిలో ఉన్న అతన్ని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుర్రని (హెల్మెట్) ఇంట్లో పెట్టి వచ్చావేంటి బెదరూ.. కొంచెం ఉంటే బుర్ర పుచ్చకాయలా పగిలిపోయేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్కూల్ బస్సు ముందు వెళ్తున్నప్పుడు దూరాన్ని పాటించాలన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా అంటూ తిడుతున్నారు. వాహనం మూల మలుపు నుంచి రోడ్డుపైకి వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో ఓవర్ టేక్ చేయకూడదు. పైగా స్కూల్ బస్సు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మరి నిర్లక్ష్యంగా బండి నడిపిన యువకుడిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
#BreakingNow: कर्नाटक के दक्षिण कन्नड़ में दर्दनाक हादसा, कार और बाइक की हुई टक्कर @AnchorAnurag #Accident #Karnataka pic.twitter.com/YJkI66v7Yz
— Times Now Navbharat (@TNNavbharat) April 1, 2023