దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పదుల సంఖ్యలో ప్రమాదాలు జరగడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. వారి కుటుంబాలు రోడ్డున పడున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రోడ్డు భద్రతాచర్యల్లో భాగంగా కఠిన చట్టాలు అమల్లోకి తీసుకు వస్తున్నాయి. అయినా కూడా కొంత మంది తమ తీరుమార్చుకోవడం లేదు. రోడ్డుపై తమ ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ఎదుటివారి ప్రాణాలకు యమ భటుల్లా తయారు అవుతున్నారు.
రోడ్డు నియమాలు పాటించని వారిని పట్టుకుంటే వారు మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ రాజకీయ నేతలు తమకు బంధువులు, స్నేహితులు అవుతారని ట్రాఫిక్ సిబ్బందిపై ఫైర్ అవుతుంటారు. ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. సైరన్లతో భారీగా శబ్దాలు చేస్తూ వెళ్తున్న వాహనాలను అడ్డగించినందుకు ఒక ట్రాఫిక్ కినిస్టేబుల్ ప్రయత్నించాడు. తాము భాజపా ఎమ్మెల్యే బంధువులమని.. మమ్ముల్నే ఆపుతావా అని బెదిరించారు. ఈ గోల పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ లో రోడ్డుపై సైరన్లతో వెళ్తున్న వాహనాలను అడ్డగించి, ఫొటోలు తీయాలని ప్రయత్నించాడు ఒక కానిస్టేబుల్. తాము భాజపా ఎమ్మెల్యే అశుతోశ్ శుక్లా బంధువులమని, ‘మా వాహనాలనే అడ్డగిస్తావా’ అంటూ కానిస్టేబుల్‌తో గొడవపడ్డారు. అంతేకాదు తమనే ఆపి ఫోటోలు తీస్తావా.. నీ అంతు చూస్తామని కానిస్టేబుల్‌ను గట్టిగా బెదిరించి.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి పంచాయతీ పెట్టారు. ఇక స్టేషన్ లో కూడా వారి కండకావరం ప్రదర్శించారు.
కానిస్టేబుల్ తాను ఏమీ తప్పు చేయలేదని.. రూల్స్ ప్రకారం వెళ్లానని అధికారులతో చెప్పాడు. ఆ సమయంలో పక్కన ఉన్న తోటి పోలీస్ సిబ్బంది కూడా నోరు విప్పకపోవడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ బాధతో వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ.. పోలీసు ఉన్నతాధికారులెవరూ స్పందించకపోవడం గమనార్హం. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In UP’s Unnao, a traffic constable cries inconsolably as supporters of a BJP leader who allegedly misbehaved with him sit around at the local police station. Incident took place after traffic constable stopped a car with a hooter on. pic.twitter.com/zS0gBaNvJo
— Piyush Rai (@Benarasiyaa) May 17, 2022