మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో చోటుచేసుకున్న ఘటనపై యావత్ దేశం స్పందించింది. గిరిజనుడు దశమత్ రావత్ పై అగ్ర కులానికి చెందిన ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేయడాన్ని హేయమైన చర్యగా మండిపడుతూ.. నిందితుడ్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో చోటుచేసుకున్న ఘటనపై యావత్ దేశం స్పందించింది. గిరిజనుడు దశమత్ రావత్ పై అగ్ర కులానికి చెందిన ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేయడాన్ని హేయమైన చర్యగా మండిపడుతూ.. నిందితుడ్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించింది. నిందితుడ్ని అరెస్టు చేయడమే కాకుండా.. ఇంటిలో కొంత పోర్షన్ అక్రమంగా కట్టారంటూ కూల్చివేసింది. అనంతరం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గిరిజనుడి కాలు కడిగి క్షమాపణ కోరారు. అంతేకాకుండా బాధితునికి రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.1.5 లక్షలు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఈ ఘటన సద్దు మణిగింది అనుకున్నారు.
అయితే ఇప్పుడు కొత్త ట్విస్టు ఇచ్చాడు దశమత్ రావత్. తనపై మూత్ర విసర్జన చేసిన ప్రవేశ్ శుక్లాను క్షమించి విడిచిపెట్టాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని వేడుకున్నాడు. నిందితుడు తన తప్పును తెలుసుకున్నాడని, అతడిని విడిచిపెట్టాలంటూ కోరారు. మీడియా ముందు మాట్లాడుతూ.. ‘అవును అతను చేసింది తప్పే అయినప్పటికీ.. ఆయన మా ఊరి పూజారి. అందుకే అతన్ని విడుదల చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నా’ని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, మీడియా తమకు అండగా నిలబడ్డాయని, కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని మర్చిపోతారని, వాళ్లు మా మీద కక్ష కడితే.. ఎవరూ బాధ్యులు అంటూ భయంతో ప్రశ్నించారు. తాము, తమ పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుంటున్నామని, ఎవ్వరితో గొడవలు వద్దనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అంతలోనే ఈ ఘటన ఇప్పడు జరగలేదంటూ బిగ్ ట్వస్ట్ రివీల్ చేశారు. అది 2020లో జరిగిందని చెప్పారు. ‘ఓ రాత్రి పూట పది గంటల సమయంలో ఓ దుకాణం మెట్లపై మీద కూర్చున్నా. అతను నా దగ్గరకు వచ్చి నాపై మూత్రం పోశాడు. ఆ సమయంలో నేను అతని ముఖం కూడా చూడలేదు. ఈ విషయం గురించి నేనెవ్వరితో చెప్పలేదు. ఇప్పుడు అతని తప్పును తెలుసుకున్నాడు. రాష్ట్రప్రభుత్వాన్ని కోరేదొక్కటే.. అతడిని విడిచిపెట్టండి. మా ఊరికి రోడ్లు వేయమని మాత్రమే నేను ఆశిస్తున్నా’అంటూ పేర్కొన్నాడు. గతంలో జరిగిపోయిందేదో జరిగిందని, అతడిని విడిచిపెట్టాలని కోరారు. మరోవైపు రోజు తన భర్త సామాన్యుడని, 100, 200 రూపాయలు సంపాదిస్తేనేగానీ తమ ఇల్లు గడవదని.. అలాంటిది ఊరిలో ఎవరితో తమకు శత్రుత్వం వద్దని భార్య ఆశా సైతం ఆందోళన చెందుతుంది. అయితే శుక్లా ఇంటిని కూల్చేయడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన తప్పు చేస్తే కుటుంబానికి శిక్ష వేశారంటూ మండిపడుతున్నాయి.