ప్రస్తుతం యూపీలో ఆరోదశ పోలింగ్ జరుగుతుంది. మేం చేసిన అభివృద్ది పనులకు మళ్లీ ప్రజలు మళ్లీ మాకే పట్టం కడతారని గట్టి నమ్మకంతో అధికార పక్షం గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమయింది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ రోజు 10 జిల్లాల్లోని 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది.
ఇక్కడ మొత్తం 675 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాల గోరఖ్‌నాథ్ కన్యానగర్ లో తన ఓటును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌కు చెందిన అజయ్ కుమార్ లల్లూ, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య వంటి భారీ నాయకుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో ఎంపీగా పోటీ చేశారు. కానీ ఇప్పుడే తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ రికార్డు స్థాయి విజయం సాధిస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఆరోదశ ఎన్నికల్లో 80శాతం సీట్లు తమకే వస్తాయని స్పష్టం చేశారు. ఈసారి కూడా తమ ప్రభుత్వమే ఏర్పాటవుతుందన్నారు సీఎం యోగి. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు లల్లూ తమ్‌కుహి రాజ్ స్థానం బరిలోకి దిగగా, ఇటీవలే మంత్రిపదవికి రాజీనామా చేసి.. బీజేపీ గుడ్‌బై చెప్పి సమాజ్ వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య ఫాజిల్‌నగర్ నుంచి బరిలోకి దిగారు.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath casts his vote at Primary School Gorakhnath Kanya Nagar Kshetra, in Gorakhpur, for the 6th phase of #UttarPradeshElections pic.twitter.com/Eou6apv4p0
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 3, 2022