కొన్నాళ్లుగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ పేరు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతిక్ అహ్మద్ కుటుంబానికి యోగి ప్రభుత్వం చెక్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన లిస్టులో మరో పేరు వచ్చి చేరిందని టాక్ బాగా వినిపిస్తోంది.
ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు ఇప్పుడు వార్తల్లో బాగా నిలుస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని చెబుతూనే ఉన్నారు. తాజాగా చేతల్లో ఆ విషయాలను చూపిస్తున్నారు. ఇప్పటికే గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుటుంబానికి యోగి ప్రభుత్వం చెక్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు గ్యాంగ్ స్టర్ల విషయంలో యోగి ఆదిత్యనాథ్ ఫోకస్ మరింత పెంచారని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన లిస్టులో ఉన్నది ఎవరు? ఆయన నెక్ట్స్ టార్గెట్ ఎవరు? అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానంగా యూపీలో ఒక పేరు బాగా వైరల్ అవుతోంది.
అతిక్ అహ్మద్ కుటుంబానికి చెక్ పెట్టిన తర్వాత ఇప్పుడు యోగీ లిస్టులో ఉన్న పేరు అంటూ.. మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ పేరు వినిపిస్తోంది. ఇప్పుడు ఫోకస్ ముఖ్తార్ ఫ్యామిలీపై పడింది అంటూ చెబుతున్నారు. అయితే అసలు ముఖ్తార్ అన్సారీ ఎవరు? నిజంగానే అంత పెద్ద గ్యాంగ్ స్టరా? అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ముఖ్తార్ అన్సారీ కుటుంబం మొత్తం గ్యాంగ్ స్టర్ ఫ్యామిలీ అనే చెప్పాలి. ఎందుకంటే వారిపై అన్ని కేసులు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్తార్ అన్సారీ, అతని కుమారుడు అబ్బాస్ అన్సారీ ఇప్పటికే బందా జైలులో ఉన్నారు. రూ.125 కోట్ల కేసులో అన్సారీని ఆదాయపన్ను అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ముఖ్తార్ అన్సారీ 2021 నుంచి బందా జైలులోనే ఉన్నాడు. అతనిపై ఒక్క యూపీలోనే కాదు.. పంజాబ్ లో కూడా కేసులు ఉన్నాయి. 1987లో ముఖ్తార్ అన్సారీపై తొలి క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఆ తర్వాత అతనిపై ఇప్పటివరకు 61 కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు అతని భార్య అఫ్షాన్ పై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. యూపీ పోలీసులు ఇటీవల రివార్డు ఉన్న 12 మంది క్రిమినల్స్ జాబితాని విడుదల చేశారు. అందులో ముఖ్తార్ అన్సారీ భార్య అఫ్షాన్ పేరు కూడా ఉంది. పైగా ఆమెపై రూ.50 వేలు రివార్డును కూడా పెంచారు. 2005లో మౌ అల్లర్లకు ముఖ్తార్ కి సంబంధం ఉందంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ అన్సారీ కుటుంబానికి సంబంధించి గ్యాంగ్ స్టర్ చట్టం కింద ఏప్రిల్ 29న ఘాజీపూర్ ఎంపీ- ఎమ్మెల్యేల కోర్టులో నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. అయితే ముఖ్తార్ ఫ్యామిలీపై యోగి ఆదిత్యనాథ్ టార్గెట్ ఫిక్స్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.