ఎప్పుడో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథలు విన్నాం. చిన్న వయసులోనే ఓ ముసలావిడకు ఇచ్చి బాల్య వివాహాన్ని చేసేస్తారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీలో వరుడికి 70 ఏళ్లు, వధువుకి 28 ఏళ్లు. తన కోడలినే మామ వివాహం చేసుకున్న వింత సంఘటన. ఇంతకూ ఈ పెళ్లి ఎక్కడ జరిగిందనుకుంటున్నారూ.. ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలో . ప్రస్తుతం ఈ పెళ్లి ఆ జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే బర్హల్ గంజ్ కొత్వాలి ప్రాంతంలో ఛపియా ఉమ్రావ్ అనే గ్రామం ఉంది. అందులో 70 ఏళ్ల కైలాష్ యాదవ్ కుటుంబం నివసిస్తుంది. బర్హల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నారు. అతడి భార్య 12 ఏళ్ల క్రితం చనిపోయింది. అతడికి నలుగురు పిల్లలు. వీరందరికీ పెళ్లిళ్లు చేశారు. కైలాష్ మూడో కుమారుడు కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో కోడలు పూజ (28ఏళ్లు) ఒంటరిగా ఉంటోంది. అయితే ఆమెకు మరో పెళ్లి చేయగా వచ్చేసి కైలాష్ ఇంట్లోనే ఉంటుందని సమాచారం.
ఈ సమయంలోనే మామకు, కోడలకు మధ్య ప్రేమ ఏర్పడి.. ఈ వివాహానికి దారి తీసిందని వార్త కథనాలు వస్తున్నాయి. ఓ గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాక.. కుటుంబ సభ్యులు అడుగుతున్న ప్రశ్నలు సమాధానం చెప్పకుండా మిన్నకుండిపోయారట. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ పెళ్లిపై ఆ ఊరంతా చర్చించుకుంటుందట. ఈ పెళ్లిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.