యోగి ఆదిత్యనాథ్ పేరు చెబితేనే గ్యాంగ్‌స్టర్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఎవరి ఇంటి ముందు బుల్డోజర్ నిలుస్తుందో.. ఎవరి మీద గోలీ ప్రయోగిస్తారో అర్థం కాక భయంతో బతుకుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆంగ్ల మీడియాలో వచ్చిన ఓ లిస్ట్.. గ్యాంగ్‌స్టర్లను మరింత కలవపరపెడుతోంది. ఆ వివారలు..
వారం రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో మాఫియా డాన్ అతీఖ్ అహ్మద్‌పై పోలీసులు, మీడియా సమక్షంలో ముగ్గురు దుండగులు కాల్పులు జరిపి హతం చేసిన సంగతి తెలిసిందే. అతీఖ్ మృతికి రెండు రోజుల ముందే.. అతడి కుమారుడిని పోలీసులు ఎన్‌కౌంటర్లో హతమార్చారు. అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడిపై కాల్పులు.. కుమారుడు అసద్‌ని ఎన్‌కౌంటర్ చేయడంపై విపక్షాలు విమర్శలు చేశాయి. కానీ ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. గ్యాంగ్‌స్టర్‌గా మొదలైన అతీఖ్.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పవర్, పొజిషన్ పెరగడంతో.. నేరాల సంఖ్య కూడా పెరిగింది. దశాబ్దాలుగా అతీఖ్ మీద వందకుపైగా కేసులు నమోదయ్యాయి. కానీ ఒక్క కేసులో కూడా జైలుకు వెళ్లలేదు. బెయిల్ మీద బయట తిరిగేవాడు. అయితే యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సీన్ మారింది. 44 ఏళ్ల అతీఖ్ నేర సామ్రాజ్యాన్ని యోగి 50 రోజుల్లో మట్టు పెట్టాడు. ఉమేష్ పాల్ కేసుతో అతీక్ నేర చరితకు శుభం కార్డు పడింది.
అతీఖ్ హత్య, అతడి కుమారుడి ఎన్‌కౌంటర్ తర్వాత యూపీలో మిగిలిన గ్యాంగ్‌స్టర్లకు భయం పట్టుకుంది. ఏ నిమిషం ఎవరు ఎలా బలవుతారో అర్థం కాకుండా భయంతో బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన ఓ వార్త నిందితులను మరింత కలవపరపెడుతోంది. అతీఖ్ నేర సామ్రాజ్యం కుప్పకూల్చిన యోగి.. మరో 61 మంది గ్యాంగ్‌స్టర్ల భరతం పట్టే పనిలో ఉన్నారంట. యూపీలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న 61 మంది మాఫియా లీడర్ల జాబితా తయారు చేశారని ఇంగ్లీష్ మీడియా వెల్లడించింది. 61 మంది పేర్లు, వారి మీద నమోదయిన నేరాలతో సహా జాబితా విడుదల చేసింది. వీరంతా ప్రధాన టార్గెట్లు. అయితే యోగి ఆదిత్యనాథ్ ఇంకా ఈ జాబితాకు ఆమోద ముద్ర వేయలేదని ఇంగ్లీష్ మీడియా వెల్లడించింది. అయితే త్వరలోనే దీన్ని యోగి ఓకే చేస్తాడని.. అప్పుడు వీరిలో ఒక్కొక్కరు హతం కావాల్సిందే అంటున్నారు యూపీ జనాలు.
ఈ జాబితాలో ప్రధాన మాఫియా లీడర్లు సుధాకర్ సింగ్, గబ్బర్ సింగ్, ఉద్ధం సింగ్, సునీల్ రాఠి, అభిషేక్ సింగ్ హనీ అకా జహర్, రిజ్వాన్ జహీర్, అనుపం దూబే, జుంగు వాలియా తదితరులు ఈ జాబితాలో ఉన్న ప్రధాన మాఫియా లీడర్లు. ఇక త్వరలోనే యోగి వీరి భరతం పడతారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇక యోగి తీరు తెలిసిన వారు.. త్వరలోనే వీరు ఒక్కొక్కరు హతమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందు వరకు కూడా అక్కడ గుండారాజ్యం ఏలేది అని మీడియాలో బొలేడు కథనాలు. అప్పటి నాయకులు కొందరు గ్యాంగ్‌స్టర్‌లను ప్రొత్సాహించేవారిని.. రాజకీయ అండదండలతో పెరిగిన వారు.. ఆ తర్వాత ప్రభుత్వాలను శాసించే స్థాయికి ఎదిగారని.. ఈ గుండాగిరి వల్ల ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారంటూ బోలేడు కథనాలు. అయితే యోగి ఆదిత్యనాథ్.. యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోన్న మాఫియా సమస్యపై తన దృష్టి పెట్టాడు యోగి. యూపీలోని చోటా మోటా లీడర్లకు ఒకటే హెచ్చరిక జారీ చేశాడు. లొంగిపొండి.. లేదంటే బుల్డోజర్, బుల్లెట్ దాడికి ఎదురు నిలవండి అని ఒపెన్‌గా ప్రకటించాడు.
యోగి ఆదిత్యనాథ్‌కు భయపడి చాలా మంది నేరగాళ్లు, మాఫియా లీడర్లు.. లొంగిపోయి.. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మరి కొందరు రాష్ట్రం వదిలి పరారయ్యారు. ఇక యోగి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 183 మంది క్రిమినల్స్ హతమయ్యారు. ఈ ఆరేళ్ల కాలంలో రాష్ట్రంలో 10వేలకు పైగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. 23వేలకు పైగా అరెస్టులు చోటు చేసుకున్నాయి. వీరిలో 5,046 మంది గాయాలతో పట్టుబడ్డారు. ఇవి అధికారిక లెక్కలు. యోగి ప్రభుత్వం అనుసరిస్తోన్న బుల్డోజర్, గోలీ మార్ తీరుపై విపక్షాలు విమర్శలు చేస్తుంటే.. జనాలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మానవ హక్కుల పేరిట సుప్రీం కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు.
కానీ యోగి మాత్రం తగ్గడం లేదు.. వేనకడుగు వేయడం లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా మాఫియాపై ఉక్కుపాదానికే రెడీ అయ్యారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో పేరు మోసిన 61 మంది మాఫియా డాన్‌ల జాబితా విడుదల చేశారని అంటున్నారు జనాలు. మరి యోగి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటాడో.. రాష్ట్రంలో ఇంకెన్ని ఎన్‌కౌంటర్లు జరుగుతాయో చూడాలి అంటున్నారు జనాలు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకుంటన్న నిర్ణయాలను మీరు సమర్ధిస్తారా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.