సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని అబ్బుర పరిచే విధంగా ఉంటే.. కొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయి. ఈ మద్య కొన్ని వివాహాలు చిత్ర విచింత్రంగా జరుగుతున్నాయి.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వార్తలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అప్పటి వరకు మనకు కనీ వీనీ ఎరుగని సంఘటనలు మన కళ్లముందు ఆవిష్కరింపబడుతున్నాయి. దేశంలో జరుగుతున్న అరుదైన సంఘటనలకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఆరేళ్ల క్రితం భర్తను కోల్పోయిన ఓ మహిళకు గ్రామస్థులు దగ్గరుండి మరీ ఆమె ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపించారు. అప్పటికే ఆ మహిళకు పది మంది పిల్లలు ఉండటం గమనార్హం. ఈ అరుదైన వివాహం ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం..
ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ లో పది మంది పిల్లలకు తల్లి అయిన ఓ వితంతవు.. తన ప్రియుడిని వివాహం చేసుకుంది. ఈ వివాహాన్ని ఊరి పెద్దలు దగ్గరుండి మరీ జరిపించారు. అంతేకాదు గ్రామానికి చెందిన ఓ కాలేజ్ ప్రిన్సిపల్ ఈ జంటకు ఉద్యోగాలు.. ఉండటానికి వసతీ గృహాన్ని కూడా ఏర్పాటు చేసి పది మంది పిల్లలకు అండగా నిలిచాడు. గ్రామస్థుల కథనం ప్రకారం.. బహల్ గంజ్ ప్రాంతానికి చెందిన సోనీ శర్మ (42) మొదటి భర్త ఆరు సంవత్సరాల క్రితం చనిపోయాడు.. అప్పటికే సోనీ శర్మకు పది మంది పిల్లలు ఉన్నారు. భర్త చనిపోయిన కొంతకాలం తర్వాత అదే గ్రామానికి చెందిన బాలేంద(40) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారడంతో ఏడాది క్రితం గ్రామం నుంచి పరారైయ్యారు. అయితే అప్పుడప్పుడు సోనీ శర్మ తన గ్రామానికి వచ్చిపోతూ ఉండేది.. ఆ సమయంలో గ్రామస్థులు పిల్లల క్షేమ సమాచారం అడిగి తెలుసుకునేవారు. ఈ క్రమంలోనే గ్రామస్థులు సోనీ శర్మ, బాలేంద్రకు వివాహం జరిపించి.. వారికి కొత్త జీవితం ప్రసాదించాలని భావించారు.
బాలేంద్ర, సోనీ శర్మకు వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్న గ్రామస్థులు వారిని తమ ఊరికి పిలిపించి పంచాయితీ పెట్టారు. గ్రామానికి చెందిన పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ జై ప్రకాశ్ షాహీ ఈ వ్యవహారాన్ని దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఇద్దరిని ఒప్పించి గ్రామంలో ఉన్న శివాలయంలో వివాహం జరిపించారు. పెద్దల సమక్షంలో ఇద్దరు దండలు మార్చుకున్నారు. ఊరివాళ్లే తమ ఖర్చుతో విందు ఏర్పాటు చేశారు. సోనీ శర్మ పది మంది పిల్లలకు ఇప్పుడు తండ్రి ఉన్నాడని.. వారికి ఎలాటి ఇబ్బంది ఉండదని జై ప్రకాశ్ షాహి అన్నారు. అంతేకాదు బాలేంద్ర, సోనీ శర్మకు తమ కాలేజ్ లో ఉద్యోగాలు ఇప్పించడమే కాదు.. వారు నివసించేందుకు ఉచితంగా వసతీ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.