ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండో పర్యాయం ఎన్నికయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండవసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నేరస్తులకు, అక్రమా దంతాలు చేసేవారికి ఆయన స్వింహస్వప్నంగా నిలుస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితులుగా ఉండే యోగీ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన పాక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో వెనుకబడ్డ రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ అభివృద్దికి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బుందేల్ ఖండ్ ప్రాంతానికి ఓ తీపి కబురు చెప్పింది. ఈ ప్రాంత అభివృద్ది కోసం అధికార పార్టీ ఎంతో కష్టపబుతుందని ప్రధాని అన్నారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలో రెండు రక్షణ కారిడార్లలను తీసుకు రాబోతున్నామని.. అందులో ఒకటి బుందేల్ ఖండ్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని అన్నారు. తమ రాష్ట్రానికి రక్షణ కారిడార్ అందుబాటులోకి వస్తున్న విషయంపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ లో రక్షణ కారిడార్ ఏర్పాటుతో ఎంతో మందికి ఉద్యోగావకాశం కలుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుందేల్ ఖండ్ రీజియన్ లోని బాందాలో ఏర్పాటు చేసిన కలింజార్ మహోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ.. ఇక్కడ తయారు చేసే ఫిరంగులు గర్జించడం మొదలు పెడితే.. ప్రపంచ పటంలో పాకిస్థాన్ కనిపించకుండా పోతుందని అన్నారు. అంతేకాదు బుందేల్ ఖండ్ అభివృద్ది కోసం ఎక్స్ ప్రెస్ హైవేను నిర్మించినట్లుగా యోగా గుర్తు చేశారు.
ఈ సదుపాయం వల్ల చిత్ర కూట్ – ఢిల్లీ మద్య ప్రయాణ సమయం ఎంతో తగ్గిందని అన్నారు. రాష్ట్రంలో రక్షణ కారిడార్ నిర్మాణం కొనసాగుతుంది.. ఇక్కడ ఫిరంగులు తయారైతే.. అక్కడ పాక్ గుండెల్లో వణుకు పుడుతుంది. ప్రపంచ పటంలో పాక్ అదృశ్యమవుతుందని అన్నారు. ఉత్తర్ ప్రదేవ్ లో డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్ ని ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు.