సాధారణంగా సినిమాల్లో దొంగ-పోలీస్ ఫన్నీ సీన్లు చూస్తుంటాం. దొంగ చేతికి తన చేతికి బేడీలు వేసుకున్న పోలీసును ఆ దొంగ ముప్ప తిప్పలు పెట్టడం సినిమాల్లో చూస్తుంటాం.. థియేటర్లో పగలబడి నవ్వుకుంటాం. నిజ జీవితంలో కూడా కొన్ని సార్లు ఇలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి.. పోలీసుల కన్ను కప్పి దొంగలు తప్పించుకుపోవడం చూస్తుంటాం. కొన్ని సార్లు పుణ్యానికి పోతే పాపం ఎదురైందని అంటుంటారు.. ఈ పోలీసుల విషయంలో అలాగే జరిగింది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లిన పోలీసులు ఓ నింధితుడిని పట్టుకు రావడానికి బయలు దేరారు. తిరుగు ప్రయాణంలో గంగా నది లో పుణ్య స్నానం చేయాలని భావించారు.. కానీ అదే వారి కొంప ముంచింది.
మధ్యప్రదేశ్‌లోని ఒక ఛీటింగ్ కేసు నిందితుణ్ని అరెస్టు చేసేందుకు యూపీలోని ప్రతాప్‌గఢ్ పోలీసులు బయలు దేరారు. అక్కడ నింధితుడిని పట్టుకొని బేడీలు వేశారు. అంత వరకు బాగానే ఉంది.. కానీ తిరిగి వచ్చే సమయంలో గంగానదిలో స్నానం చేయాలని భావించి దొంగతో పాటు పోలీసు సైతం నదిలో మునక వేయడం ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది అది కాస్త తెగ వైరల్ కావడంతో పై అధికార దృష్టికి వెళ్లింది. పోలీసులు డ్యూటీ చేసే విషయం ఇలా ప్రవర్తించడంపై షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు బుర్హాన్‌పుర్ ఎస్పీ తెలిపారు.