ఈ మద్య కాలంలో కొంతమంది డబ్బు కోసం ఏ నీచమైన పనికైనా సిద్దపడుతున్నారు. డబ్బు కోసం బంధాలు, అనుబంధాలను కూడా లెక్కచేయడం లేదు. కొంతమంది సంపాదించింది ఖర్చు పెట్టకుండా పిసినారిలా వ్యవహరిస్తుంటారు. మరికొంత మంది అప్పు చేసి మరీ ఖర్చు చేస్తుంటారు. మరికొంత మంది తమ వద్ద ఉన్నదాంట్లో పేదలకు దాన, దర్మాలు చేస్తుంటారు. ఓ వ్యక్తి తన దగ్గర డబ్బులు లేకపోయినా భిక్షాటన చేసి ఓ ప్రభుత్వ పాఠశాల కోసం లక్షల్లో విరాళం ఇచ్చాడు.. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడు తూత్తుకుడికి చెందిన పూల్‌పాండియన్ (72) భిక్షమెత్తుకుని జీవిస్తున్నాడు. తాను బిక్షమెత్తుకుంటూ పూట గడిచిపోతే చాలు అని మాత్రం అనుకోలేదు.. ఏదో ఒక మంచిపని చేయాలన్న తపనలో ఉండేవాడు. బిచ్చగాడు అయినా పూల్‌పాండియన్ మంచి మనసు చాటుకున్నాడు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఇప్పటివరకు రూ.55.60 లక్షలను పలు జిల్లాల కలెక్టర్లకు అందించాడు. సోమవారం నాడు వేలూరు కలెక్టరేట్‌లో గ్రీవెన్‌సెల్‌కు వెళ్లి తన దగ్గర ఉన్న రూ.10వేలను కలెక్టర్‌కు అందించాడు. ఆ మొత్తాన్ని గత కొన్ని రోజులుగా ఎంతో సంక్షోభంలో ఉన్న శ్రీలంక ప్రజలకు ఉపయోగించాలంటూ విజ్ఞప్తి చేశాడు.
తాను పుష్కరకాలంగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నానని అన్నాడు పూల్‌పాండియన్. పది మందికి సహాయం చేస్తే.. తన మనసు ఎంతో సంతోషంగా ఉంటుందని పూల్‌పాండియన్ అన్నారు. ప్రజలు తనకు డబ్బులు దానంగా ఇస్తున్నారని.. తనకు వచ్చే డబ్బును ప్రజల కోసమే ఉపయోగిస్తున్నానని.. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్లు వివరించాడు. ఇంత మంచి మనసు ఉన్న పూల్‌పాండియన్ మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.