ఈ రోజుల్లో పెట్స్ బర్త్ డేలు సెలబ్రేట్ చేయడం ఓ ట్రెండ్ గా మారింది. కొందరు తాము ప్రేమగా పెంచుకునే శునకాలకు, మరికొందరు పిల్లులకు బర్త్ డే వేడుకలు చేయడం చూశాం, విన్నాం. శునకాలకు బర్త్ డేలు చేయడం, వాటిని అందంగా అలంకరించడం కామన్ గా మారింది. ఆ మద్య తమిళనాడులోని ఓ పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ తమ పెంపుడు కుక్కకి వైభవంగా శీమంతం చేశారు. అంతేకాకుండా, సన్నిహితులను,పొరుగింటివారిని ఆహ్వానించి ఘనంగా ఈ వేడుక చేశారు.
తాజాగా తమిళనాడుకు చెందిన ఓ మహిళ కడుపుతో ఉన్న తన పెంపుడు పిల్లులకు సీమంతం చేసింది. గర్భం దాల్చినప్పటి నుంచి ఆ పిల్లులకు క్రమం తప్పకుండా ఓ వెటర్నరీ క్లినిక్‌లో పరీక్షలు కూడా చేయించింది. వైద్యుల సూచన మేరకు ప్రత్యేకమైన ఆహారం, స్నాక్స్ అంజేస్తుంది ఆ మహిళ. సాధారణంగా గర్భిణులకు సీమంతం చేస్తారు. ఆ గర్భిణి దీర్ఘ సుమంగళిగా ఉండాలని, ఆమె కడుపులోని బిడ్డ దీర్ఘాయుష్షుతో జీవించాలని ఈ వేడుకలో ముత్తైదువలు అక్షింతలు వేసి దీవిస్తారు.
ఇది చదవండి : సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం!
తమిళనాడుకు చెందిన ఓ మహిళ తాను పెంచుకుంటున్న పిల్లులకు వైభవంగా శీమంతం చేయాలనే ఆలోచన రావడంతో.. పూలు, పండ్లతోపాటు తన పిల్లులను క్లినిక్‌కు తీసుకెళ్లి సీమంతం నిర్వహించింది. ఈ సీమంతం వేడుకలో వైద్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భంతో ఉన్న రెండు పిల్లులను ఆశీర్వదించారు. పిల్లులకు వైద్యపరీక్షలు చేస్తున్న క్లినిక్‌లోనే వైద్యులతో కలిసి ఈ వేడుకలు జరిపాం అని పిల్లులకు సీమంతం నిర్వహించిన మహిళ తెలిపారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Tamil Nadu | A pet parent in Coimbatore performed a baby shower ritual for her cats
People conduct baby showers for humans so we did the same for our cats as they are a member of our family. We came to the clinic & organized the baby shower along with the doctors,said pet parent pic.twitter.com/YketB5BJap
— ANI (@ANI) January 2, 2022