వయోవృద్ధులు, వికలాంగులు, అనారోగ్యం కారణంగా నడవలేని వారి బాధలు వర్ణనాతీతం. తిండికి ఆటంకాలు లేకపోయినా కాలకృత్యాలు తీర్చుకోవడం వారిముందున్న అతి పెద్ద సమస్య. ఇది అందరి ఇళ్లలో చూస్తూనే ఉంటాం.. ఎక్కడపడితే అక్కడ మలవిసర్జన చేస్తావంటూ ఇంట్లో వారు తిడుతుంటారు. దీనికి పరిష్కారం చూపింది.. ఓ యువతి.
మంచానికి పరిమితమైన వారి భాదలు ఎలా ఉంటాయో అందరికీ విదితమే. బయటకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదించలేకపోవటాన్ని పక్కన పెడితే.. తిండి దగ్గర నుండి మలమూత్ర విసర్జన వరకు అన్నీ అక్కడే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొందరి ఇళ్లలో తీవ్రమైన సమస్య. అన్నం పెట్టడానికి కుటుంబసభ్యులు అసహ్యించుకోకపోయినా వారి మలమూత్ర విసర్జనలు శుభ్రం చేసే సమయంలో ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇది అందరి ఇళ్లలో జరిగేదే. దీనికి పరిష్కారం చూపింది.. తమిళనాడుకు చెందిన ఓ యువతి.
వయోవృద్ధులు, వికలాంగులు, అనారోగ్యం కారణంగా నడవలేని వారికి, మరుగుదొడ్డికి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నవారికి అన్ని విధాలుగా సహాయపడేలా ‘సహాయత’ పేరుతో ఓ స్మార్ట్ వీల్‌ఛైర్ రూపొందించింది. దీని సాయంతో వారు ఇతరులు అవసరం లేకుండా అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు. ఏ ఆవిష్కరణ తీసుకున్నా దాని వెనుక బలమైన కారణం తప్పక ఉంటుంది. అలానే, దీని వెనుక ఓ కన్నీరు పెట్టించే కథనం ఉంది. అదే ఈ ఆవిష్కరణకు ప్రాణం పోసింది.
కోయంబత్తూరుకు చెందిన 27 ఏళ్ల శ్రుతి అనే యువతి బయో మెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ పూర్తిచేసి స్థానికంగా మెడికల్ కోడర్‌గా పనిచేసేది. ఈ క్రమంలో తనకు ఓ సామాజిక ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఫెలోషిప్ చేసే అవకాశం లభించింది. అందులో భాగంగా ఓసారి కోయంబత్తూరులోని ఓ ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడ కనిపించిన ఓ దృశ్యం ఆమె మనస్సును కలిచి వేసింది. పక్షవాతం బారిన పడిన ఓ వ్యక్తి స్ట్రెచర్‌పైనే మల విసర్జన చేసుకున్నాడు. ఆ సమయంలో అతడికి తోడుగా తన కుమార్తెలు మాత్రమే ఉన్నారు. తనంతకు తాను శుభ్రం చేసుకుందామంటే వీలు కాదు.. సహాయం కోసం వారి వైపు దీనంగా చూశాడు. అప్పుడు ఆ అమ్మాయిల ఇబ్బందికర పరిస్థితి, అది చూసి వారి తండ్రి ముఖంలో అవమాన భారం కళ్ళ వెంట నీళ్లు రావడం.. శ్రుతి గమనించింది.
ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులతో నిత్యం ఎంతో మంది అవమానాలను ఎదుర్కొంటూ జీవిస్తున్న విషయం ఆమెను ఆలోచింపజేసింది. వారు గౌరవంగా జీవించగలిగేలా ఏదైనా పరిష్కారాన్ని చూపాలనుకుంది. అదే స్మార్ట్ వీల్‌ఛైర్ ఆవిష్కరణకు నాంది పలికింది. సులువుగా వినియోగించగలిగేలా, సౌకర్యవంతమైన చక్రాల కుర్చీని రూపొందించాలనుకుంది. అందుకు మెకానికల్ ఇంజినీర్ అయిన తన తండ్రి సహాయం కూడా తీసుకుంది. చివరకు ఎన్నో పరీక్షల అనంతరం తాను అనుకున్న స్మార్ట్ వీల్‌ఛైర్‌కు ప్రాణం పోసింది. ఇది ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్లడానికే కాదు, అవసరమైతే స్టెచర్‌లా, మలమూత్ర విసర్జనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యంత్రం సహాయంతో శుభ్రమయ్యే టాయిలెట్ సౌకర్యమున్న ఈ వీల్‌ఛైర్‌లా సృష్టించింది. దీనికి ‘సహాయత’ అనే పేరు పెట్టింది.
Our innovative toilet wheelchair 🦼🦼 provides you with the opportunity to start a new life 💫💫 with independence and respect. #postsurgery #caretaker #oldagehomes #wheelchairforoldagepeople #defecationcleansing #defecation #medicalwheelchair #sahayatha #sahayathawheelchair pic.twitter.com/lphoknlyOu
— Sahayatha Healthcare (@sahayathahealth) April 3, 2023
ఈ వీల్‌ఛైర్ కు బ్యాటరీని అనుసంధానించారు. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు నెల రోజులు పనిచేస్తుంది. వీల్‌ఛైర్ కు ఉన్న బటన్ నొక్కితే సీటు మధ్య భాగం పక్కకు జరిగి కమోడ్‌లా మారుతుంది. కింద భాగంలో అమర్చిన ఓ కప్పు లాంటి పాత్రలోకి మానవ వ్యర్థాలు వెళ్లే ఏర్పాటు చేశారు. ఆ పాత్రను కూర్చున్నవారికి ఇబ్బంది కలగకుండా వెనుక నుంచి బయటకు తీయొచ్చు. అనంతరం మనిషి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గా శుభ్రం చేయడానికి వీలుగా ఓ నీటి నిల్వ పాత్రను, యంత్రాన్ని అనుసంధానించారు. ఈ చక్రాల కుర్చీ వల్ల మరుగుదొడ్డి వరకూ వెళ్లాల్సిన ఇబ్బంది, సహాయకుల అవసరం తప్పుతుంది.
ఇటీవల ఓ ఛానల్‌లో ప్రసారమైన ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ ప్రోగ్రాంలో ఈ స్మార్ట్ వీల్‌ఛైర్‌ను శృతి ప్రదర్శించగా న్యాయనిర్ణేతలు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఆవిష్కరణ చూసి శ్రుతి ఆలోచనను మెచ్చుకోవడమే కాకుండా పెద్దఎత్తున వీటిని ఉత్పత్తి చేసేందుకు ముందుకొచ్చారు. 10 శాతం ఈక్విటీలో రూ.కోటి పెట్టుబడి పెట్టడానికి అంగీకరించారు. ఆ వీల్‌ఛైర్‌లను శ్రుతి తన సొంత వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలోనూ విక్రయిస్తోంది. ఈ వీల్ ఛైర్ రూ.39,900కు అందుబాటులో ఉంది. ఈ ఆవిష్కరణపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sruthi Babu’s innovation is Sahayatha, a smart wheelchair with an assistive cleaning device, offers both convenience and dignity to immobile patients. She recently raised Rs 1 crore in funding on Shark Tank India.#innovative #startup #sharktank #sharktankindia #sharktankindia pic.twitter.com/RzxDXU6bWT
— Talent Pie (@TalentPie) March 22, 2023