తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏంకే స్టాలిన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తన పాలనలో ప్రత్యేక మార్క్ కనపడేలా పేద, మద్యతరగతి ప్రజల సంక్షేమం కోసం స్టాలిన్ సరికోత్త ప్రయోగాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇటీవల తమిళనాడు అసెంబ్లీలోని క్యాంటిన్ ను రద్దు చేస్తూ స్టాలిన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది మరువక ముందే స్టాలిన్ తమిళనాడు పోలీసులకు వీక్లీ ఆఫ్ ను అమలు చేస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ఉత్వర్వులు జారీ చేశారు.
శాంతి భద్రతల కోసం అనునిత్యం కష్టపడుతున్న పోలీసుల కోణంలో ఆలోచించి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ వీక్లీ ఆఫ్ అమలు దిశగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇక నూతన ఉత్తర్వుల ప్రకారం ఫస్ట్, సెకండ్ గ్రేడ్ పోలీసులు, హెడ్ కానిస్టేబుళ్లకు వారంలో ఒకరోజు వీక్లీ ఆఫ్ తీసుకునే అవకాశం కల్పించారు. స్టేషన్లలోని ఇతర సిబ్బంది షిఫ్ట్ పద్ధతుల్లో వీక్లీ ఆఫ్ తీసుకోవచ్చు. సీఎం వీక్లీ ఆఫ్ ను అమలుకు ఉత్తర్వులు జారీ చేయటంతో తమిళనాడు పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.