కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత పలు అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆవిడ కొవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు. కరోనా సోకడానికి ముందు నుంచే సోనియా శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే సాధారణ హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు పార్టీలోని కొందరు చెబుతున్నారు.
ఆస్పత్రిలో సోనియా గాంధీకి తోడుగా ఆమె కుమార్తె ప్రియాంక వాద్రా ఉన్నారు. తల్లికి తోడుగా ఉండేందుకు ఆవిడ ఆస్పత్రికి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్ చేరుకున్న విషయం తెలిసిందే. యూపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా ప్రియాంక వాద్రా భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఆమె తల్లికి సహాయంగా ఉండేందుకు తన పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లారా? లేక అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
Sonia Gandhi Admitted To Delhi’s Ganga Ram Hospital With Viral Infection https://t.co/LVqY6Woj8k pic.twitter.com/ejbEVwathp
— NDTV News feed (@ndtvfeed) January 4, 2023