ఇటీవల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడ్డాయి. వర్షాల కారణంగా పలు చోట్ల నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లాయి. పలు చోట్ల భవనాలు, ఆలయాలు కూలిపోయాయి.
దేశ వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా పలు జలాశయాలు, నదులు, కాల్వలు నిండి పొంగిపొర్లుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి లోతట్టు ప్రాంతాలన్ని పూర్తిగా జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదలతో ఆ ప్రాంత ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. వర్షాల కారణంగా పలు భవనాలు, ఆలయాలు కూలిపోతున్నాయి. కొండచరియలు విరిగి రోడ్లు, భవనాలపై పడుతున్నాయి. తాజాగా సిరోన్ లోని శివాలయంపై కొండచరియలు పడటంతో 15 మంది మృతిచెందారు.
హిమాచల్ ప్రదేశ్ సోమవారం ఉదయం సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంపై కొండచరియలు విరిగిపడటంతో ఆలయం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. కొంతమంది భక్తులు శిథిలాల కింద కూరుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సావన్ సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు శివాలయానికి దాదాపు 50 మంది భక్తులు వచ్చి ఉంటారని.. అదే సమయంలో ఆలయంపై కొండచరియలు విరిగిపడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.
సిరోన్ లోని శివాలయంపై కొండచరియలు పడి కుప్పకూలిపోయిన విషయం గురించి తెలిసి ఆలయం కూలిన ప్రదేశానికి ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ చేరుకోనున్నారు.
భారీ వర్షాలు కురియడంతో కొండచరియలు శివాలయంపై విరిగిపడి దుర్ఘటన చోటు చేసుకుందని.. ఈ ఘటనలో 9మంది మరణించారని హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ చెప్పారు. శిథిలాల కింద మరో 20 మందికి పైనే ఉన్నట్లు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం సఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ లో గత 48 గంటలుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
#Watch | Temple in Shimla’s Summer Hill area collapses due to a landslide triggered by heavy rainfall in Himachal Pradesh.
Follow #LIVE updates: https://t.co/PAZ2aqypdY pic.twitter.com/Gfnyc28Gkh
— The Indian Express (@IndianExpress) August 14, 2023