ఈ మద్య ప్రమాదాలు ఏ రూపంలో వచ్చిపడుతున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్తితి నెలకొంది. అప్పటి వరకు మనతోపాటే ఉండేవారు.. హఠాత్తుగా ప్రమాదాలకు గురై చనిపోవడం.. తీవ్రంగా గాయాలపాలు కావడం చూస్తున్నాం.
ప్రమాదాలు ఎప్పుడు ఎలా ముంచుకు వస్తాయో ఎవరూ చెప్పలేరు. మన కళ్ల ముందు అప్పటి వరకు హ్యాపీగా గడిపిన వారు అకస్మాత్తుగా ప్రమాదాలకు గురై తీవ్ర గాయాలపాలవుతుంటారు.. కొన్నిసార్లు చనిపోతుంటారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు, హర్ట్ ఎటాక్ మరణాలు, ప్రకృతి విపత్తు వల్ల మరణాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఏలూరు బస్టాండ్ లో ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు పాత బస్టాండ్ లో ప్రమాదం జరిగింది. పాత బస్టాండ్ లోని 1వ నెంబర్ ఫ్లాట్ ఫామ్ పై స్లాబ్ కూలి అక్కడే ఉన్న కొంతమంది పై పడిపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. తోటి ప్రయాణికులు వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.