ఈ మధ్యకాలంలో చాలా మంది క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ కుప్పకూలుతున్నారు. అచ్చం ఇలాగే ఓ యువకుడు పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పాడు.
చెన్నైలోని ఓ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించాడని తెలిపారు. ఈ ఘటనతో మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. యువకుడి మరణంతో అతని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలేం జరిగిందంటే?
చెన్నైలోని రాజేష్ (21) అనే యువకుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే, ఇటీవల సీతలపక్కంలో తమ బంధువుల వివాహం ఉంటే ఆ వేడుకకు హాజరయ్యాడు. అప్పటి వరకు బంధువులతో కలిసి నవ్వుతూ మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఆ యువకుడు అందరితో కలిసి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఇక అందరూ చూస్తుండగానే ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే స్పందించిన బంధువులు అతడిని పైకి లేపే ప్రయత్నం చేశారు. కానీ, ఆ యువకుడు అస్సలు స్పందించలేదు.
ఇక చేసేదేం లేక వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ యువకుడు అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. కొడుకు మరణవార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిపాడి ఒక్కసారిగా చనిపోవడంతో అస్సలు నమ్మలేకపోతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ యువకుడి మరణానికి కారణం తెలియాల్సి ఉంది.