దేశంలో రాజీవ్ గాంధీ హత్య ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ కేసులో కొంతమంది ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. తాజాగా రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో పెరరివాలన్ జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.. ఆయనని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జీవితఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన పేరరివాలన్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారం ద్వారా ఆయనను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, పెరరివాలన్ గత ముప్పై ఏళ్లుగా జైలు శిక్ష అనుభవించారు. ఆయన శిక్షను మినహాయించాలని గతంలో తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసినప్పటికీ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో జాప్యం జరుగుతూ వచ్చింది.
ఈ నేపథ్యంలో పెరరివాలన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఏజీ పేరరివాలన్‌ను విడుదల చేయాలని జస్టిస్ ఎల్ నాగేశ్వర రావ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశించింది. పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడు ఎటువంటి ఫిర్యాదుల చరిత్ర లేకపోవడం సహా సుదీర్ఘమైన జైలు శిక్షను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం మార్చి 9న పెరారివలన్‌కు బెయిల్ మంజూరు చేసింది.