కుమారి, శ్రీమతి వంటి పదాలను పెట్టుకోవాలని ఏ మహిళనూ అడగరాదని కోరుతూ ఒకరు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఇది వ్యక్తిగత విషయమని వాదించారు. అయితే, దీనిపై సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది.
సాధారణంగా మహిళలు.. తమ పేరుకు ముందు కుమారి, శ్రీమతి లాంటి పదాలను పెట్టుకుంటారు. పెళ్లికానీ అమ్మాయిలు కుమారి అని, పెళ్లైన వారు శ్రీమతి అని.. తమ పేరుకు ముందు ఉపయోగిస్తారు. అయితే ఈ పదాల వాడకానికి సంబంధించి విషయంపై ఒకరు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు.. కీలక వ్యాఖ్యలను చేసింది. అలానే సదరు వ్యక్తి వేసిన పిటిషన్ ను కొట్టి వేసింది. ఇంతకు ఆ పిటిషన్ ఏంటి?.. ఈ కేసులో సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీమతి, కుమారి వంటి పదాలను పేరుకు ముందు పెట్టుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీం కోర్టు ధర్మాసనం సుదీర్ఘ విచారణ తరువాత తాజాగా తీర్పును వెల్లడించింది. అలానే ఇందుకు సంబంధించిన పిటిషన్ ను కోటేసింది. అసలు ఈ పిటిషన్ ప్రచారానికి దాఖలు చేసినట్లు కనిపిస్తోందంటూ ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏ అమనుల్లాల నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పేరుకు ముందు కుమారి, శ్రీమతి లాంటి పదాలను వినియోగించే విషయంలో మహిళను అడగకూడదని అంటున్నారని, ఒకవేళ ఎవరైనా వాటిని ఉపయోగిస్తే ఎలా నిరోధిస్తారని కోర్టు ప్రశ్నించింది.
ఇందుకు ఒక ప్రత్యేక విధానం అంటూ ఏమీ లేదని తెలిపింది. పేరుకు ముందు ఆ పదాలను వాడాలా వద్దా అనేది ఆ వ్యక్తి ఎంపికను అనుసరించి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఇక పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసలు మీరు మా నుంచి కోరుకుంటున్న ఊరట ఏంటి?, ఇది కేవలం ప్రచారానికి వేసినట్లే ఉందంటూ కోర్టు తెలిపింది. కుమారి, శ్రీమతి లాంటి పదాలను మహిళలు పేరుకు ముందు పెట్టుకోకుండా ఉండాలని మీరు కోరుకుంటే వారిని ఎలా నిరోధిస్తారు అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. అది వాళ్ల ఇష్టమంటూ తీర్పునిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ విషయంలో ఉత్తర్వులు జారీ చేయడం కుదరదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.