ప్రతీ మధ్యతరగతి మానవుడి కోరిక తనకంటూ ఓ సొంత ఇల్లు ఉండటం. దాని కోసం రాత్రనకా.. పగలనకా.. కష్టపడతాడు. మరి తన చెమటను రక్తంగా మార్చి కట్టుకున్నఇల్లు ను ప్రభుత్వం కూలుస్తూ ఉంటే చూస్తూ ఉరుకోం కదా! దానిని ఎలాగైనా కాపాడుకోవాలని చూస్తాం. కానీ ఈ పంజాబ్ రైతు తన ఇల్లు కోసం ఎవరూ సాధ్యం కానీ పని చేసి చూపిస్తున్నాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సాధారణంగా రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం ఇళ్లను తొలగించడం సహజమే. అలా ఇళ్లను కోల్పోయిన వారికి ప్రభుత్వం తరుపు నుంచి నష్ట పరిహారం కూడా అందుతుంది. అయితే ఓ రైతు తనకు నచ్చినట్టు కట్టుకున్నఇళ్లు కూడా రోడ్డు విస్తరణలో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రైతుకు నష్ట పరిహారం సైతం ప్రభుత్వం చెల్లించింది. కానీ అతని మనసుకు మాత్రం ఆ ఇళ్లుని కొల్పోవడం ఇష్టం లేదు.
కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న రహదారిని ఢిల్లీ, అమృత్‌సర్ కత్రా ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రైతు సుఖ్ విందర్ సింగ్ ఇళ్లు ఈ రోడ్డు విస్తరణలో కూల్చాల్సి వస్తోంది. దీనికి అతడికి ప్రభుత్వం నష్ట పరిహారం కూడా అందించింది. అయినప్పటికీ ఆ ఇంటిని కూల్చడం ఇష్టం లేని సుఖ్ విందర్ సింగ్ ఏకంగా ఆ ఇంటినే తరలించడానికి పూను కున్నాడు. కార్మికుల సహాయంతో ఇంటిని రోడ్డు నుంచి 500 అడుగు దూరంలోకి కదిలించేందుకు పనులు ప్రారంభించాడు.
ఆ ఇంటి నిర్మాణానికి సుఖ్ విందర్ సుమారు రూ. 1.5 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చాడు. అదీ కాక ఇంటిని నిర్మించడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టినట్లు తెలిపాడు. ఈ ప్రతిష్టాత్మకమైన జాతీయ రహదారి ప్రాజెక్టును పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ గత నెలలో ప్రకటించారు. ఈ రహదారి వల్ల కాశ్మీర్‌కు ప్రయాణించే ప్రయాణికులకు సమయం, డబ్బు, ఆదా అవుతుందని అధికారులు చెప్పారు. సొంత ఇంటి కోసం సుఖ్ విందర్ సింగ్ చేస్తున్నా ప్రయత్నంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.