గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు ముంపుబారిన పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల కొండ చరియలు విరిగి పోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వరద ప్రభావంతో ఒక రైల్వే వంతెన శనివారం ఉదయం కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా పంజాబ్, హిమాచల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు చక్కీ నదికి వరద నీటి ప్రవాహం పోటెత్తింది. ఈ క్రమంలో పంజాబ్, హిమాచల్ సరిహద్దులోని కాంగ్రా జిల్లాలోని చక్కి నదిపై నిర్మించిన 800 మీటర్ల పొడవైన రైల్వే వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. ఇక వంతెన కొత్త పిల్లర్‌ను నిర్మించే వరకు పఠాన్‌కోట్, జోగిందర్‌నగర్ మధ్య నారో గేజ్ రైలు సర్వీస్ ను నిలిపివేశారు అధికారులు. 1928లో బ్రిటిష్ వారు నిర్మించిన ఈ నారో గేజ్ రైలు మార్గంలో పఠాన్‌కోట్, జోగిందర్ నగర్ మధ్య ప్రతిరోజూ ఏడు రైళ్లు నడుస్తున్నాయి. ఇక్కడ ఉన్న వందలాది గ్రామ ప్రజలకు ఈ రైలు మార్గం జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ రోడ్డు, బస్సు సౌకర్యాలు ఏవీ లేవు. 90 ఏళ్ల చరిత్ర ఉన్న రైల్వే వంతెనకు ఇలాంటి దుస్థితి కలగడానికి కారణం నదీగర్భంలో కొంత మంది దుండగలు చేసే అక్రమ మైనింగే అంటున్నారు స్థానికులు. గత నెలలో వంతెన పిల్లర్‌లో పగుళ్లు ఏర్పడ్డాయి అప్పటి నుంచి ఇక్కడ రైలు సేవలను నిలిపివేశారు. ఇప్పుడు వంతెనకు సంబంధించిన స్తంభం కొట్టుకుపోయింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Himachal Pradesh | Chakki bridge in Kangra district collapsed today, says ADM Kangra, Rohit Rathore. Heavy rainfall is likely in Kangra, Chamba, Bilaspur, Sirmaur, and Mandi districts today. (Photo source: Screenshot from viral video) pic.twitter.com/qAushMTsZH — ANI (@ANI) August 20, 2022 Several years old railway bridge built on Chakki river in Pathankot broke down, railway line of three pillars of the bridge hanging in the air, bridge damage caused by strong water coming from the mountains in Chakki river, Punjab Himachal Narrows railway link completely broken , pic.twitter.com/qakryS7rus — BHARAT GHANDAT (@BHARATGHANDAT2) August 20, 2022