భారతదేశంలో రోజు రోజుకు న్యాయ వ్యవస్థ మీద విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. మెున్న బిల్కిస్ బానో కేసులో 11 మందిని స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా విడుదల చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా జరిగిన మరో ఘటన పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చలా మారింది. పోలీస్ వ్యాన్ నుంచే నిందితుడు కేక్ కట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం భారతదేశంలో ఏ వ్యక్తి అయినా అరెస్ట్ అయితే అతన్ని జైల్లో ఉంచుతారు. ఇక అతడికి రాజకీయ పలుకుబడి ఉంటే అతడి జైలు గదే అతడి ఇల్లు కూడా అవుతుంది. నిందితులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్న సందర్భాలు మనం కోకొల్లలు చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. ఉల్లాస్ నగర్ కు చెందిన రోషన్ ఝా అనే పేరు మోసిన గ్యాంగ్ స్టర్ మీద అనేక హత్యా, దోపిడీ, బెదిరింపు, రకరకాల కేసులు అతడి మీద ఉన్నాయి.
ఈ క్రమంలో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కోసం కోర్టుకు తరలిస్తున్న నేపథ్యంలో ఓ సంఘటన జరిగింది. రోషన్ ఝా ను పోలీసు వ్యాన్ ఎక్కించగా అక్కడే ఉన్న అతని అనుచరులు అతడి పుట్టిన రోజు కావడంతో కేక్ తెచ్చారు. ఆ కేక్ ను రోషన్ కిటికీ లోనుంచే కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. భాయ్ కా బర్త్ డే అంటూ పాటను సైతం పాడుతూ కోలాహలం చేశారు. ఈ తతంగాన్ని అంతా అనుచరులు తమ ఫోన్స్ లలో రికార్డ్ చేసుకుని వాట్సాప్ స్టేటస్ లుగా పెట్టుకోవడంతో వైరల్ గా మారింది. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తోన్నాయి.
అది కాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో థానే రూరల్ ఎస్పీ విక్రమ్ దేశ్ మన్ ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ఇదిలా ఉండగా నిందితుడిగా ఉన్న వ్యక్తికి పోలీసుల అనుమతి లేనిదే తిను బండారాలు అందించరాదు. ఇలాంటి ఘటనల వల్లే సామాన్యులకు రోజు రోజుకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లుతోందని న్యాయ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Video of an undertrial cutting cake in police van with his friends goes viral#Cake #Police #Criminals #Crime #ViralVideo #Video #Watch #India #Trending #IndiaNews #kalyan #mumbai #mumbainews #mumbaipolice pic.twitter.com/fugenabLeS
— Free Press Journal (@fpjindia) August 22, 2022