వరలక్ష్మీ శరత్‌కుమార్.. నటిగా ఆమెకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించింది. హీరోయిన్‌గా అంతగా రాణించలేకపోయిన ఈ అమ్మడు ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్‌పై దృష్టి పెట్టింది. లేడీ విలన్‌గా, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎన్నో చక్కని పాత్రలు చేసింది. ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇటీవలే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన ఆమె టాలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. కెరీర్ ప్రారంభం నుంచి కాస్త బొద్దుగా ఉండే ఈ అమ్మడు ఒక్కసారిగా సన్నగా, నాజూకుగా తయారైంది. పొట్టి గౌను వేసుకుని తన ట్రాన్స్‌ఫర్‌మేషన్ చూపించేసింది. తాజాగా వరలక్ష్మి షేర్ చేసిన ఇమేజెస్ చూసి అసలు ఈమె ఆమేనా? అంటూ నోరెళ్లబెడుతున్నారు. అంతేకాకుండా తనలాగే ఎవరైనా మారచ్చు అంటూ మోటివేట్ కూడా చేస్తోంది. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) “మీ మీద మీకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటే మార్పు ఎప్పుడైనా, ఎవరికైనా సాధ్యమే. మీరు ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయాన్ని ఎదుటివాళ్లకు చెప్పే అవకాశం ఇవ్వకండి. ఆత్మవిశ్వాసమే గొప్ప ఆయుధం.. మీపై మీకు నమ్మకం ఉండాలి.. మీకు మీరే గట్టి పోటీ అని నమ్మండి.. మీరు ఏం సాధించగలరో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు” అంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) ప్రస్తుతం వరలక్ష్మి లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమెను చూసి అభిమానులు, నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఏంటి ఇంతలా మారిపోయారు? ఇంత సన్నగా ఎలా అయ్యారు అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరైతే అప్పుడు, ఇప్పుడు ఎప్పుడైనా మీరు బాగుంటారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందంటూ ప్రశంసిస్తున్నారు. వరలక్ష్మీ లేటెస్ట్ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #transformation can happen at anytime to anyone..believe in yourself.. don’t let anyone tell you what u can and cannot do..confidence is your best weapon.. challenge yourself.. you are the best competition for yourself.. you will be surprised how much you can achieve.. #believe pic.twitter.com/RzqEyR8e98 — (@varusarath5) August 22, 2022 ఇదీ చదవండి: హీరోగా మారిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. ఫస్ట్ లుక్ వైరల్! ఇదీ చదవండి: హీరో కాకముందు చిరంజీవి నటించిన సీరియల్ ఏదంటే!