వివాహేతర సంబంధం.. ఇవే నేటి కాలంలో సాఫీగా సాగుతున్న దాంపత్య జీవితాల్లో నిప్పులు రాజేస్తున్నాయి. భర్తను కాదని కొందరు మహిళలు బరితెగించి ప్రవర్తిస్తూ అడ్డదారుల్లో అడుగులేస్తున్నారు. సరిగా ఇలాగే అడుగులేసిన ఓ మహిళ ఇద్దరి ప్రియుళ్లతో ఎంజాయ్ చేస్తూ చివరికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వివరాల్లోకి వెళ్తే.. అది కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురంలోని రాయుచూరు. ఇదే ప్రాంతానికి చెందిన లక్ష్మికి గతంలో వివాహ జరగగా భర్త మరణించాడు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి తల్లిదండ్రులు ఆమెకు మరో వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే కారణం ఏమో తెలియదు కానీ లక్ష్మి రెండవ భర్తకు విడాకులు ఇచ్చి దూరం జరిగింది. దీంతో అప్పటి నుంచి లక్ష్మి తమకూరులో ఉన్న ఓ గోశాలలో పని చేస్తుండేది. ఇక్కడే దొడ్డలింగప్ప, వెంకటేష్ అనే ఇద్దరు యువకులు సైతం పని చేస్తున్నారు. కొంత కాలానికి లక్ష్మి ఇద్దరిని ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయణం సాగించింది. అస్సలు అనుమానం కూడా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. మరో విషయం ఏంటంటే? లక్ష్మి.., ప్రియుడు దొడ్డలింగప్ప వద్ద గతంలో రూ.30 వేలు తీసుకుంది. అయితే లక్ష్మి వెంకటేష్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం ప్రియుడు దొడ్డిలింగప్పకు తెలిస్తే డబ్బులు అడగడంతో పాటు గొడవ చేస్తాడని భావించింది. దీంతో లక్ష్మి దొడ్డిలింగప్పకు వెంకటేష్ తో ప్రేమాయణం గురించి తెలియకముందే దొడ్డలింగప్పను చంపాలని ప్లాన్ గీసింది. ఇందులో భాగంగానే లక్ష్మి ఇటీవల ప్రియుడు దొడ్డలింగప్పను తన ఇంటికి పిలిచి తాగేంత మద్యం చేతికందించింది. ఇక ఫుల్ గా తాగి మత్తులోకి జారుకున్నాక మరో ప్రియుడు వెంకటేష్ ను తన ఇంటికి రమ్మని కబురు పంపింది. ఇక ఇద్దరు కలిసి దొడ్డలింగప్ప తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. అనంతరం శవాన్ని నెలమంగల బ్రిడ్జి వద్ద పడేసి పోయారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: భార్యపై అనుమానం.. ఇద్దరు పిల్లల్ని అడవిలోకి తీసుకెళ్లి తండ్రి దారుణం!