న్యూయార్క్‌లో ఉండే మజిన్ ముఖ్తార్ విభిన్నమైన స్కూల్ ప్రాజెక్ట్‌తో 2013లో ఇండియాకు తిరిగి వచ్చాడు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్‌లో మాస్టర్స్ చేస్తున్న పర్మిత తో కలసి 2016లో అక్షర్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. చక్కటి కరిక్యులమ్‌తో సాఫీగా సాగిపో సాగింది. ఒకరోజు బడి ఆవరణలో పోగైన ప్లాస్టిక్ వ్యర్థాల పొగవాసన రావడంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు పిల్లలు. అది విద్యార్థుల ఆరోగ్యానికీ, పర్యావరణ హితానికి ఎంత హానికరమో గ్రహించారు పర్మిత, ముఖ్తార్‌లు. ఆ ప్లాస్టిక్‌ను ఇటు బడిలోని పిల్లలకు ఉపయుక్తంగా అటు పర్యావరణానికి క్షేమంగా మార్చాలని నిర్ణయించుకున్నారిద్దరూ. ఫీజుకు బదులుగా ప్లాస్టిక్‌ను తీసుకోవాలని నిశ్చయించు కున్నారు.
అక్షర్ ఫౌండేషన్ ద్వారా త్వరలోనే మరో వంద స్కూళ్లను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్టూ తెలిపారు. అక్షర్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులంతా ప్రతిరోజూ పుస్తకాల సంచితోపాటు ప్లాస్టిక్ వ్యర్థాల సంచినీ పట్టుకొని బడికెళ్తున్నారు. వాళ్లందరికీ అక్కడ చదువు ఉచితం. ఇరవై మంది విద్యార్థులతో ప్రారంభమైన ఆ స్కూలు ప్లాస్టిక్‌ను ఫీజుగా తీసుకోవడం మొదలుపెట్టేప్పటికి వందకు పైనే దాటింది. తమ పరిసరాల్లోంచి తెచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలను విద్యార్థులు బడి ఆవరణలో పోగేస్తారు. వాటిని ఎలా రీసైకిల్ చేయాలిలో చేసిన వాటిని తిరిగి ఎలా ఉపయోగించాలో ప్రాక్టికల్స్ ద్వారా నేర్చుకుంటున్నారు.
ఒకేషనల్ ట్రైనింగ్‌లో భాగంగా ఇప్పుడు ప్లాస్టిక్ రీసైకిలింగ్ కూడా స్కూల్ కరిక్యులమ్‌లో భాగమైంది. ఈ రీసైకిల్ ప్లాస్టిక్‌ను తరగతి గదులు, టాయ్‌లెట్ల నిర్మాణానికి మెటీరియల్‌గా వాడుతున్నారట. ప్రతిపాదనను తొలుత అయిష్టంగానే ఒప్పుకున్నారు స్థానికులు. వీళ్లలో ఎక్కువ మంది క్వారీల్లో కూలికి వెళ్తూ రోజుకి 150 నుంచి 200 రూపాయలు సంపాదించేవాళ్లే. ఆ డబ్బుతో ఇల్లు గడవడమే గగనం. అందుకే చాలా మంది పిల్లలు స్కూల్‌కి వచ్చేవారు కాదు.
‘ఫీజుకు బదులు ప్లాస్టిక్‌ను తీసుకుంటే ఇటు పిల్లలనూ బడికి రప్పించిన వాళ్లమవుతాం., అటు పర్యావరణ పరిరక్షణ మీద అవగాహనా కల్పించిన వాళ్లమవుతాం అనిపించింది. ఊహించినట్టుగానే రెండూ జరుగుతున్నాయి. పిల్లలు చదువు పూర్తిచేసిన వెంటనే ఉద్యోగం తెచ్చుకునేలా వాళ్లను ట్రైన్ చేస్తున్నాం. హైస్కూలు పిల్లలతో ట్యూషన్స్ చెప్పించి వాళ్లకు కొంత డబ్బులు (టాయ్‌మనీ) ఇస్తున్నాం. అవి వాళ్లకు స్నాక్స్, బట్టలు, బొమ్మలు, షూలు వంటివి కొనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయ’ని చెప్పారు పర్మిత, ముఖ్తార్.