టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీపై ఓ స్కూల్లో ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో క్వశ్చన్ అడిగారు. విరాట్ పోరాటం, పట్టుదలకు సలాం కొట్టిన ఆ స్కూల్ యాజమాన్యం ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నాపత్రంలో విరాట్ గురించి ఓ క్వశ్చన్ అడిగింది.
సాధారణంగా ప్రపంచ ప్రసిద్ది చెందిన వ్యక్తుల జీవిత చరిత్రలను పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక గొప్ప వ్యక్తులకు సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులు రాసే పరీక్ష పేపర్లలో అడుగుతుండటం కూడా మనం కొన్ని సందర్భాల్లో చూశాం. ఇక తాజాగా టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీపై ఓ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో క్వశ్చన్ అడిగారు.ఇప్పటికే కొంత మంది క్రికెటర్లపై ప్రశ్నలు అడిగిన విషయం మనకు తెలిసిందే. తాజాగా విరాట్ వారి సరసన చేరాడు. విరాట్ పోరాటం, పట్టుదలకు సలాం కొట్టిన ఆ స్కూల్ యాజమాన్యం ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నాపత్రంలో విరాట్ గురించి ఓ క్వశ్చన్ అడిగారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ..రికార్డుల రారాజు, టీమిండియా రన్ మెషిన్, ఫిట్ నెస్ కా బాప్.. ఇలా మరెన్నో ముద్దుపేర్లతో పిలుచుకుంటారు అభిమానులు. వరల్డ్ క్రికెట్ ను తన బ్యాట్ తో శాసిస్తున్న కింగ్ కోహ్లీ.. పట్టుదల, పోరాటం చూసిన ఓ స్కూల్ యాజమాన్యం అతడి గురించి విద్యార్థులకు తెలియజేయాలనుకుంది. అందులో భాగంగానే ఆ స్కూల్లో 9వ తరగతి చదివే విద్యార్థులకు కోహ్లీ తన ఫామ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విధానం గురించి వివరించండి అని ప్రశ్న ఇచ్చారు. ఈ ప్రశ్నాపత్రానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ క్రమంలోనే గత కొంత కాలంగా ఫామ్ లో లేక తెగ ఇబ్బందులు పడ్డాడు విరాట్ కోహ్లీ. దాదాపు మూడు సంవత్సరాలు సెంచరీ చేయకపోవడంతో.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు విరాట్ భాయ్. ఆ విమర్శలన్నింటికి తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు. టీ20, వన్డే, టెస్టుల్లో సెంచరీలు చేసి మునుపటి ఫామ్ లోకి వచ్చాడు విరాట్ భాయ్. ఈ పోరాట పటిమను గూర్చి విద్యార్థులకు తెలియజెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఆ స్కూల్ యాజమాన్యం విరాట్ పై ప్రశ్న అడిగిందని తెలుస్తోంది.
Virat Kohli’s image got featured in a 9th standard English question paper and fans flooded Twitter with the same.#ViratKohli #RCB #IPL2023 #Cricket https://t.co/68TYQSSyxk
— CricTracker (@Cricketracker) March 25, 2023