పిల్లలు పుట్టినప్పటి నుంచి ప్రయోజకులు అయ్యే వరకూ తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారు. పిల్లల కోసం తమ లక్ష్యాన్ని, తమ ఇష్టాలని వదులుకుంటారు. మరి అలా వదులుకునే పేరెంట్స్ కి.. ఏ పిల్లలైనా తిరిగి ఇవ్వాల్సింది ఏంటి అంటే సాధించడం. జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగి చూపించడం ఒక్కటే తల్లిదండ్రులకు పిల్లలు ఇచ్చే బహుమతి. తల్లిందండ్రులను ఆనందంగా ఉంచడం కోసం ఏ పని చేసినా పర్లేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం తల్లిదండ్రులను ఊహించని విధంగా సర్ప్రైజ్ చేశాడు. కొడుకు ఇచ్చిన సర్ప్రైజ్ కి తల్లిదండ్రులు సంతోషంతో మురిసిపోతున్నారు. మామూలుగా తమ కుటుంబ సభ్యుడు ఏ ఆర్టీసీ బస్సో, ప్రైవేట్ బస్సో నడుపుతుండగా.. కుటుంబ సభ్యులు ఆ బస్సు ఎక్కితే కలిగే ఫీలింగే వేరు. ఆ సమయంలో చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. అలాంటిది కొడుకు ఎయిర్ బస్ నడుపుతుండగా.. చూసే భాగ్యం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. అలాంటి అరుదైన భాగ్యం రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన దంపతులకు దక్కింది.
కమల్ కుమార్ పైలట్ గా పని చేస్తున్నారు. అయితే ఈయన తల్లిదండ్రులు జైపూర్ వెళ్ళే ఫ్లైట్ ఎక్కారు. కానీ విమానం నడిపేది తమ కొడుకే అని వారికి తెలియదు. సడన్ గా కొడుకు కమల్ కుమార్ ను కాక్ పిట్ ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యక్షమయ్యారు. వెంటనే వారు కొడుకు దగ్గరకు వెళ్లారు. కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి పట్టరాని సంతోషంతో మురిసిపోయింది. ఆ తర్వాత కొడుకుతో కలిసి కాక్ పిట్ లో కూర్చుని ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియోను పైలట్ కమల్ కుమార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. “నేను ఎగరడం మొదలుపెట్టినప్పటి నుండి ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. చివరికి నా తల్లిదండ్రులను జైపూర్ కు తీసుకెళ్ళాను. ఇదొక లవ్లీ ఫీలింగ్” అంటూ ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోకి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరి తల్లిదండ్రులకు కొడుకు ఇచ్చిన సర్ప్రైజ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఒకప్పుడు టాటాను అవమానించిన ఫోర్డ్ కంపెనీ.. ప్లాంట్ మూసేస్తున్న తరుణంలో చివరి కారు విడుదల!
ఇది కూడా చదవండి: Sri Vishnu: హీరో శ్రీ విష్ణుకు తీవ్ర అస్వస్థత! ఆస్పత్రికి తరలింపు!