కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఓ ఘటనే ఇది. పార్క్ చేసి ఉన్న ఓ వాహనం దానికదే స్టార్ కావడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఒక చోట పార్క్ చేసిన ట్రాక్టర్ దానంతట అదే స్టార్ట్ అయింది. ఎవరూ నడపకుండానే అది ముందుకెళ్లింది. సైకిల్, బైక్ మీదుగా ఎదురుగా ఉన్న ఒక షాపులోకి దూసుకెళ్లింది. దీంతో ఆ షాపులోని వ్యక్తులు భయాందోళనలకు గురయ్యారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీలోని బిజ్నోర్‌లో ఒక స్టోర్ బయట వెహికిల్స్ పార్క్ చేసి ఉన్నాయి. అక్కడే నిలిచి ఉన్న ఓ ట్రాక్టర్ దానంతట అదే ఉన్నట్లుండి స్టార్ అయ్యింది. ఇంజిన్ స్టార్ట్ కావడంతో డ్రైవర్ లేకున్నా ట్రాక్టర్ ముందుకు కదిలింది. దాని ముందున్న ఒక సైకిల్, బైక్‌ను తోసుకుంటూ స్టోర్ ఎంట్రన్స్ దగ్గరకు వెళ్లింది. స్టోర్‌లోకి దూసుకొచ్చిన ట్రాక్టర్ అక్కడ ఉన్న గ్లాస్ ఎంట్రన్స్‌ను ఢీకొట్టింది. దీంతో స్టోర్‌లోని వ్యక్తులు భయపడ్డారు.
ట్రాక్టర్‌ను చూసిన స్టోర్‌లోని ఓ వ్యక్తి దాని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. డ్రైవర్ సీటులో ఎవరూ లేకున్నా ట్రాక్టర్ ముందుకు కదలడం చూసి కంగారుపడ్డాడు. దాని ఇంజిన్ ఆపేందుకు ప్రయత్నించాడు. ఆఖరుకు బండి వైర్లు కట్ చేయడంతో ట్రాక్టర్ ఇంజిన్ ఆగిపోయింది. ఈ షాకింగ్ ఘటనలో స్టోర్ ముందు భాగం ధ్వంసమైంది. మరోవైపు ట్రాక్టర్ దానంతట అదే స్టార్ట్ కావడం, దూసుకెళ్లడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీల్లో రికార్డ్ అయ్యింది. ఈ క్లిప్పింగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది ఘోస్ట్ ట్రాక్టర్ అని కొందు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Tarzan #tractor #bijnaur #CCTV #बिजनौर में जब बिना चालक के अचानक चल पड़ा ट्रैक्टर pic.twitter.com/MCl6RK3ORE
— Preety Pandey Bhardwaj (@prreeti1) March 3, 2023