చీకటిని పారద్రోలుతూ, వెలుగులు తెచ్చే పండుగగా, నరకాసురునిపై దుర్గామాత విజయానికి ప్రతీకగా దేశ ప్రజలు దీపావళి పండగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజు టపాసులు కాల్చడం సంప్రదాయంగా మారిపోయింది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు దీపావళి రోజు క్రాకర్స్ కాల్చడం మహాసరదా. అయితే.. అలాంటి సరదా ఇకపై ఉండబోదు. టపాసులు తయారీ, అమ్మకం, వినియోగం అన్నింటిపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా వినియోగంపై కేజ్రీవాల్ సర్కార్ నిషేధం విధించింది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు ఈ బ్యాన్ అమలులో ఉంటుందని ప్రకటించింది. బాణాసంచా తయారీ, అమ్మకం, వినియోగంపై నిషేధం అమలులో ఉంటుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆన్‌లైన్ బాణాసంచా విక్రయాలకు సైతం ఈ నిషేధం వర్తిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యం అంతకంతకూ పెరిగుతోన్నన్న నేపథ్యంలో ఆప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఢిల్లీలో దీపావళి పటాకులపై ప్రభుత్వం నిషేధించడం ఇది మూడోసారి.
Firecracker Ban In Delhi.. pic.twitter.com/nhCaXgE76z
— Govardhan Reddy (@gova3555) September 7, 2022
చలికాలం వచ్చిందంటే చాలు దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. చలి కారణంగా పొగమంచు, వాహనాల నుంచి వచ్చే పొగకు తోడు చుట్టుప్రక్కల రాష్ట్రాల్లో వ్యవసాయ పొలాల్లోని వ్యర్థాలను దహనం చేస్తుండడంతో ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోంది. బాణసంచా వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించడం సరైన నిర్ణయమా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.