ప్రపంచంలో నేటికి కూడా ఆకలితో అల్లాడుతున్న దేశాల జాబితాలో ఇండియా ముందు వరుసలో ఉంటుంది. మన దగ్గర ఒకవైపు ధనవంతులు.. ఆహారాన్ని వృథా చేస్తుంటే.. మరోవైపు పట్టెడు మెతుకుల కోసం పొట్ట చేతపట్టకుని ఆశగా చూసే అభాగ్యులు ఎందరో ఉన్నారు. ఇక పేదల కడుపు నింపడం కోసం ప్రభుత్వం వారికి రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తుంటుంది. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ ఉంది. అయితే ప్రభుత్వ పథకాలు అంటే ఎంత లోషభూయిష్టంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్పిన పని లేదు. అర్హతలతో పని లేకుండా అందరూ లబ్ధి పొందాలని చూస్తారు. మరీ ముఖ్యంగా ఆహార భద్రత కార్డులు, సబ్సిడీ సిలిండర్లు ఇలాంటివి పొందేవారిలో అనర్హులు చాలా మంది ఉంటారు. అధికారులకు తెలిసినా కూడా చూసి చూడనట్లు వదిలేస్తారు. ఈ క్రమంలో తాజాగా పంజాబ్లో చోటు చేసుకున్న ఓ సంఘటన నెట్టింట వైరల్గా మారింది. పేదలకు ఉచితంగా ఇచ్చే గోధుమలను తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి రేషన్ షాపు దగ్గరకి ఏకంగా మెర్సిడేజ్ బెంజ్ కారులో వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు.. ఈ సంఘటన పంజాబ్లోని హోషియార్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ ప్రభుత్వం పేదల కోసం ఆటా దాల్ స్కీమ్ పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా పేదలకు ఉచితంగా గోధుమలను అందజేస్తుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి రేషన్ దుకాణం దగ్గరకు మెర్సిడేజ్ బెంజ్ కారులో వచ్చాడు. ఆ తర్వాత నాలుగు బస్తాల గోధుమలు కారులో వేసుకుని చక్కా వెళ్లిపోయాడు. పక్కనే ఉన్నవారు ఈ తతంగాన్ని వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేయడంతో ఇది వైరలవుతోంది. ఇక సదరు రేషన్ డీలర్ని దీని గురించి ప్రశ్నించగా.. అతడి దగ్గర బీపీఎల్ కార్డు ఉంది.. అందుకే గోధుమలు ఇచ్చానని తెలిపాడు. ఓ వైపు దేశవ్యాప్తంగా ఉచిత పథకాలపై తీవ్రమైన చర్చ జరుగుతున్న వేళ.. ఈ వీడియో వెలుగు చూడటంతో నెటజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయని అనడానికి ఇదే నిదర్శనం.. పేదల కడుపు నింపాల్సిన పథకాలు ఇలా ధనికులకు కూడా అమలు కావడం దురదృష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పాపం దేశంలో ఇంతకంటే పేదవాడు ఎక్కడా ఉండడు అని ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #Punjab person arrived in a Mercedes to buy free wheat under the Ata Dal scheme by Punjab Government. A video of #Hoshiarpur Naloyan Chowk is going viral pic.twitter.com/9WHYN6IOaq — Parmeet Singh Bidowali (@ParmeetBidowali) September 6, 2022 ఇది కూడా చదవండి: అర్ష్ దీప్ తల్లితో మాట్లాడిన క్రీడా మంత్రి! అండగా ఉంటామని భరోసా.. ఇది కూడా చదవండి: వీడియో: అందరూ చూస్తుండగానే MLAని కొట్టిన భర్త!