ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద చర్యలతో గడగడలాడిస్తోన్న ఉగ్రవాద సంస్థ ఐసిస్. ఈ సంస్థ తమ సానుభూతి పరులతో అనేక ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది. అయితే ఈ సానుభూతి పరుల కోసం నిత్యం దేశంలో ముమ్మర వేట కొనసాగుతుంది. దేశంలో ఏ మూలన ఉగ్రచర్యలు జరిగినా దానికి ప్రధాన కారణం అంతర్గతంగా ఐసిస్ సానుభుతి పరుల హస్తం ఉండటమే. ఇప్పటి వరకు ఎంతో మంది ఐసిస్ సానుభూతి పరులను ఎన్ ఐ ఏ అధికారులు అరెస్టులు చేశారు. తాజాగా ప్రముఖ కన్నడ రచయిత మనవడి భార్యకు ఐసిస్ తో సంబంధాలు ఉన్నయనే ఆరోపణతో ఎన్ ఐ ఏ ఆమెను అరెస్టు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ కన్నడ రచయిత దివంగత బీఎమ్ ఇదినబ్బ మనవడి భార్య దీప్తి మార్లా అలియాస్ మరియం.. యువకులను ఐసిస్ వైపు ఆకర్షితులను చేస్తున్నారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు బృందం(NIA) ఆమెను సోమవారం అరెస్ట్ చేసింది. ఉళ్లాలలో ఇదినబ్బ కొడుకు బీఎం బాషా నివాసంలో ఎన్ ఐఏ అధికారులు సోదాలు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గతంలో బాషా చిన్నకొడుకు రహమాన్ ను కూడా ఎన్ ఐ ఏ అధికారులు అరెస్ట్ చేశారు.