భావితరాలకు అందించేందుకు అంతరించిపోతున్న వివిధ రకాలైన తృణ ధాన్యాలను సేకరించిదో గిరిజన మహిళ. వాటి ఉత్పత్తి మరింత పెంచేందుకు ఉచితంగా తమ గ్రామ ప్రజలకు పంచింది. ఈ పనే ఆమెను ప్రధాని మోడీ ప్రశంసించే స్థాయికి తీసుకెళ్లింది. అంతేకాకుండా..
ప్రముఖ రష్యా రచయిత లియో టాల్ స్టాయ్ రచించిన కోడి గుడ్డంత గోధుమ గింజ అనే కథ ఎంత మందికి తెలుసో తెలియదో కానీ, 1985-1990 కిడ్స్ కు ఈ కథ సుపరిచితం. ఇంతకూ ఆ కథకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే. ఓ రోజు ఒక వ్యక్తికి కోడి గుడ్డంత పెద్ద సైజులో ఓ గోధుమ గింజ దొరుకుతుంది. అదీ ఆశ్చర్యంగా అనిపించి.. రాజుకు ఇవ్వగా, అంత గోధుమ గింజ ఎలా సాధ్యం అని ఓ రైతును పిలుస్తాడు. అతడు పళ్లు ఊడిపోయి, సరిగా కళ్లు కనిపించక, చేతి కర్రతో వస్తాడు. దాన్ని గురించి అడగ్గా తన తండ్రికి తెలుసంటాడు. తండ్రిని కొడుకు కన్నా కాస్త మెరుగ్గా నడిచి వస్తాడు. అతను కూడా తన తండ్రికి తెలుసునంటాడు. తీరా అతడి తండ్రి మాత్రం ఎటువంటి ఊతం లేకుండా, చూపు మెరుగ్గా ఉండి ..చక్కగా నడుచుకుంటూ వస్తాడు.
గోధుమ గురించి అడగ్గా.. ఇవన్నీ మా తాత పండిచేవారని, అప్పట్లో అందరూ పనులు చేసేవారని చెబుతారు. అప్పట్లో అందరూ కష్టించి, మంచి ఆహారాన్ని పండించేవారని, అదే తమ ఆరోగ్య రహస్యమని చెబుతాడు. ఈ కథ ఎందుకు చెబుతున్నానంటే.. మనం కొంచెం పనికే అలిసి పోతున్నాం. అదేమంటే మీ రోజుల్లో దొరికినట్లు బలమైన ఆహారం దొరకట్లేదు అని కాకమ్మ కబుర్లను చెప్పేస్తాం. అదే కదా పైన పేర్కొన్న కథ. దీన్ని గ్రహించిన ఓ గిరిజన మహిళ.. భావితరాలకు అందించేందుకు అంతరించిపోతున్న వివిధ రకాలైన తృణ ధాన్యాలను భద్రపరస్తున్నారు. ఈ పనే ఆమెను స్వయంగా ప్రధాని మోడీ ప్రశంసించే స్థాయికి తీసుకెళ్లింది. ఆమె చేస్తున్న ప్రయత్నాలు మరెందరో స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఆ గిరిజన మహిళ పేరు లాహిరీ భాయ్. ఆమె మిల్లెట్ బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతుందని కేంద్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
మధ్యప్రదేశ్ కు దిండోరికి చెందిన 27 ఏళ్ల లాహిరీని ఇటీవల డిడి న్యూస్ పలకరించి విత్తనాలు సేకరణ వెనుక కారణాలు అడిగి తెలుసుకుంది. గతంలో తాము విత్తే బలమైన తృణ ధాన్యాలు కనిపించక, మరో చోట నుండి తెచ్చినట్లు చెప్పారు. వాటిని తెచ్చి తమ పొలంలో విత్తి, ఆ ఉత్పత్తిని మరింత విస్తరించినట్లు చెప్పారు. ఆ తర్వాత ఆ విత్తనాలను తమ గ్రామంలోని ఇతర రైతులకు పంచినట్లు చెప్పారు. పంట చేతికొచ్చాక, వాటి నుండి గింజలు సేకరించి, భద్ర పరుస్తున్నారు. తన గ్రామంలోనే కాకుండా ప్రక్క గ్రామాలకు సైతం ఆ విత్తనాలను ఉచితంగా లాహిరీ భాయి అంవదిస్తున్నారు. కనీసం 400-500 మంది రైతులకు విత్తనాలు అందించినట్లు ఆమె తెలిపారు. ఆమె సుమారు 150 తృణ ధాన్యాల విత్తనాలు సేకరించారు.
Proud of Lahari Bai, who has shown remarkable enthusiasm towards Shree Ann. Her efforts will motivate many others. https://t.co/rvsTuMySN2
— Narendra Modi (@narendramodi) February 9, 2023