పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. దేశంలో ఈ పానీ పూరిని రక రకాలుగా పిలుస్తుంటారు.. కొన్ని చోట్ల గోల్ గప్పా, పానీపూరి, గప్ చుప్ అని పిలుస్తుంటారు. ఈ పానీ పూరి ఎక్కువగా రోడ్డు పక్కన చిన్న చిన్న బండ్లపై పెట్టి అమ్ముతుంటారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా పానీ పూరి ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. కాకపోతే కొన్ని చోట్ల పానీ పూరి కోసం వాడే నీరు కలుషితం కావడం వల్ల వర్షాకాలం, శీతాకాలం సమయాల్లో రోగాలు వస్తుంటాయి.. అందుకే పరిశుభ్రంగా పానీ పూరి తినాలని అంటుంటారు. ఇక దేశంలో ఆధార్ కార్డు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి సంక్షేమ పథకం కావాలన్నా ఆధార్ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే.
సాధారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు చూపించాలని అంటుంటారు.. కానీ ఒక చోట పానీ పూరి కావాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అన్న విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇది నిజం.. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ – బింద్ సమీపంలో ఓ పానీపూరి బండి ఉంది. ఈ పానీ పూరి బండిని చోటే లాల్ భఘేల్ భగత్ అనే వ్యాపారి నిర్వహిస్తున్నారు. తన వద్దకు వచ్చి పానీ పూరి తినాలనుకునేవారు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందని ఆయన అంటున్నారు. ఇక్కడ పానీపూరి 18 నుంచి 50 సంవత్సరాల వారికి మాత్రమే అమ్ముతుంటారు.
ఛోటేలాల్ భఘేల్ భగత్ చాలా కాలంగా పానీ పూరి వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే తాను చేసే పానీపూరీ అంటే జనాలు ఎంతో ఇష్టంగా తింటారని.. కాకపోతే పిల్లలు, వృద్ధులు, గర్భంతో ఉన్న మహిళలకు అది మంచిది కాదని అంటున్నాడు. ఎందుకంటే తాను తయారు చేసే మసాలా కాస్త ఘాటుగా ఉంటుందని.. ఈ ఘాలు చిన్న పిల్లలు, వృద్దులు, గర్ణిణులు భరించలేరని అందుకే వారు అస్సలు తినవద్దని సూచిస్తున్నాడు. మొదట్లో ఈ విషయాన్ని కష్టమర్లకు చెప్పినప్పటికీ అలాగే రావడంతో ఒక బోర్డు మీద రాయించి పెట్టానన్నాడు. పానీ పూరి వ్యాపారం 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నానని.. తాను చేసే రసం అంటే ఎలాంటి వారైనా ఇష్టపడతారని.. తన మసాల్లో గొప్ప రహస్యం దాగి ఉందని అంటున్నాడు. తన వద్ద ఒకసారి పానీ పూరి రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ వస్తారని అంటున్నాడు ఛోటేలాల్ భఘేల్ భగత్ .