ఈ మధ్య కాలంలో శరీర భాగాలు కనిపించేలా పొట్టి దుస్తులు వేసుకుని ఆలయాల్లోకి వస్తున్నారు కొంతమంది మహిళలు. అయితే ఇకపై ఇలాంటి మహిళలను ఆలయాల్లోకి అనుమతించేది లేదని టెంపుల్ ఫెడరేషన్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రెస్ కోడ్ ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.
ఆలయాలు అంటే ఆధ్యాత్మిక ప్రదేశాలు. అక్కడికి వెళ్లేవారు కూడా చాలా పవిత్రంగా ఉండాలి. మగవారు, ఆడవారు నిండుగా ఒళ్ళంతా కప్పుకుని ఉండేలా వస్త్రాలు ధరిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం, సంప్రదాయం. అయితే కొంతమంది పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి వారి వస్త్రధారణ, వేషధారణతో జీవిస్తున్నారు. అక్కడి వరకూ బాగానే ఉంది. విదేశీ వారు మన సంస్కృతిని, సంప్రదాయాలను పాటిస్తుంటే మనవారు వారిని అనుసరిస్తున్నారు. అయినా గానీ ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. కానీ వీధుల్లోకి వస్తేనే పబ్లిక్ కి ఇబ్బంది. కొంతమంది ఆడవాళ్లు పొట్టి బట్టలు, శరీర భాగాలు కనబడేలా దుస్తులు వేసుకుని ఆలయాల్లోకి వస్తున్నారు. కానీ ఆలయ సిబ్బంది, నిర్వాహకులు మాత్రం అలాంటి వారిని రానివ్వడం లేదు.
కానీ అలాంటి ఆడవారు మాత్రం మేము పొట్టి బట్టలతోనే ఆలయాల్లోకి వస్తాము, ఎందుకు రానివ్వరు అంటూ రాద్ధాంతం చేస్తున్నారు. ఏదో పార్క్ కి వచ్చినట్టు, పిక్నిక్ కి వచ్చినట్టు, పబ్ కి వెళ్లినట్టు ఆలయంలోకి వస్తే ఊరుకునేది లేదని మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్ కొత్త డ్రెస్ కోడ్ ని అమలులోకి తీసుకొచ్చింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలోని నాలుగు ఆలయాల్లో డ్రెస్ కోడ్ అమలులోకి తీసుకొచ్చింది మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్. టీ షర్టులు, జీన్స్, స్కర్టులు, అసభ్యకరమైన దుస్తులు ధరించి ఆలయాలకు వస్తే అనుమతించేది లేదని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఈ డ్రెస్ కోడ్ ను అమలు చేసే యోచనలో ఉన్నట్లు టెంపుల్ ఫెడరేషన్ తెలిపింది.
నాగ్ పూర్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో డ్రెస్ కోడ్ పై అవగాహన తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని పేర్కొంది. అయితే దేవాలయాలకు మాత్రమే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు, గురుద్వారాలు, చర్చిలు, మసీదులు, పాఠశాలలు, కోర్టులు, పోలీస్ స్టేషన్లలో కూడా ఈ డ్రెస్ కోడ్ వర్తిస్తుందని మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్ వెల్లడించింది. ఆలయ పవిత్రతను, భారతీయ సంస్కృతిని కాపాడాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కాబట్టి భక్తులు శరీరం కనిపించేలా పొట్టి దుస్తులు వేసుకుని ఆలయానికి రావొద్దని.. సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని ఫెడరేషన్ కోరింది.
ఈ డ్రెస్ కోడ్ ని అమలు చేయాలని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లను కూడా మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్ అభ్యర్థించినట్లు వెల్లడించింది. అయితే ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది స్వాగతించగా.. కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఎలాంటి బట్టల్లో వస్తే ఏముంది, ఎందుకు అనుమతించరు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం గుడులకు వెళ్ళేదే ఏకాగ్రత, ప్రశాంతత కోసమని.. అలాంటి సమయంలో పబ్బుల్లోకి, క్లబ్బుల్లోకి వచ్చినట్టు పొట్టి బట్టల్లో వస్తే వచ్చిన దానికి ఫలితం ఉండదని అంటున్నారు. అందరూ సువాసనే కోరుకుంటారు, కంపుని కాదు. కంపు వచ్చినప్పుడు మైండ్ ఎలా డిస్టర్బ్ అవుతుందో అలా ఈ ఆడవాళ్లు పొట్టి బట్టలు, అసభ్యకర దుస్తుల్లో వస్తే పవిత్రత దెబ్బతింటుందని అంటున్నారు.
అయినా బట్టలు విప్పి ఆలయంలోకి రమ్మనడం లేదు కదా. నిండుగా కప్పుకునే కదా రమ్మంటున్నారు. ఒకప్పుడు రౌడీ వెధవలు ఆడవారి ఒంటి మీద బట్టలు లాగుతుంటే తప్పు అనేవారు. ఇప్పుడు వాళ్ళే విప్పేసుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏ బార్ కో, పబ్ కో ఇష్టం వచ్చినట్టు వెళ్ళండి ఎవరూ ఆపరు. కానీ గుడికి, బడికి ఐటం గర్ల్ లా వస్తానంటే చూస్తూ ఊరుకోమంటూ కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి మహారాష్ట్ర టెంపుల్ ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటి? మహిళలు పొట్టి దుస్తులతో వస్తే ఆలయంలోకి అనుమతించమని చెప్పడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.