భారతదేశం పేరు చెప్పగానే భిన్నత్వంలో ఏకత్వం ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తుంది. బహుశా మన దేశంలో ఉన్నన్ని మతాలు, ఆచారాలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచంలో మరెక్కడా ఉండవేమో. ఇక భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. పురాతన కాలం నుంచి మన దేశంలో అనేక ఆలయాలు కొలువుదీరాయి. ఇక కొన్ని ఆలయాల్లో కనిపించే వింతలకు సైన్స్ కూడా సరైన సమాధానం చెప్పలేకపోతుంది. అలానే మరికొన్ని ఆలయాల నిర్మాణం ఇప్పటి ఆర్కిటెక్ట్‌లకు కూడా అంతబట్టని విధంగా.. ఎంతో అద్భుతంగా ఉంటుంది. మన దేశంలో ఉన్న ఆలయాలన్నింటిని సందర్శించుకోవాలంటే ఓ జీవిత కాలం సరిపోదేమో. ఇక ఎక్కడైనా సరే భక్తులు ఆలయానికి వెళ్లి మొక్కుల చెల్లించుకుని.. తీర్థ, ప్రసాదాలు స్వీకరిస్తారు.
ఇక ఆలయాల్లో భక్తులకు అందించే తీర్థ ప్రసాదాలు కూడా దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకమైన ప్రసాదం ఉంటుంది. అయితే ఎంత ప్రత్యేకమైన సరే.. ఆ ప్రసాదం మాత్రం.. ఆహారపదార్థమే అయి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త ఇందుకు పూర్తి భిన్నం. ఓ ఆలయంలో ప్రసాదంగా బంగారు, వెండి నాణేలు ఇస్తారు. ఇంతకు ఆ ఆలయం ఎక్కడ ఉంది.. ప్రత్యేక ఏంటి వంటి తదితర వివరాలు మీకోసం..
ఇది కూడా చదవండి: Lucknow: 10 రోజులుగా తల్లి మృతదేహంతోనే కూతురు.. అక్కడ సీన్ చూసి పోలీసులు షాక్!
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఏడాది పొడవునా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు.. అమ్మ పాదాల చెంత కోట్లాది రూపాయల విలువైన నగలు, నగదు సమర్పించుకుంటారు. దీపావళి పండుగ సందర్భంగా అమ్మవారిని సందర్శించుకునే భక్తులు తప్పకుండా బంగారం, నగదు సమర్పించుకుంటారు. దేశంలో ఈ తరహా ఆచారం ఉన్న ఏకైక ఆలయం ఇదే. కొందరు నోట్ల కట్టలు, బంగారు, వెండి ఆభరణాలు సమర్పిస్తారు. ఈ ఆలయం కుబేరుని నిధిగా ప్రసిద్ధి చెందింది.
ఇది కూడా చదవండి: Odisha: వధువిచ్చిన షాక్‌కి పెళ్లి పీటలపై స్పృహ తప్పి పడిపోయిన వరుడు.. వీడియో వైరల్!
భక్తులకు ప్రసాదంగా ఆభరణలు…
దీపావళి పర్వదినం సందర్భంగా ఈ ఆలయంలో ధన్ తేరాస్ నుంచి వరుసగా ఐదు రోజుల పాటు దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయాన్ని పూలతో కాకుండా భక్తులు సమర్పించే ఆభరణాలు, డబ్బుతో అలంకరిస్తారు. ఈ ఆలయంలో ధన్ తేరాస్ రోజున మహిళా భక్తులు కుబేరుడికి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఐదు రోజుల్లో అలయాన్ని దర్శించుకున్న భక్తులకు ప్రసాదంగా బంగారం, వెండి, డబ్బులు ఇస్తారు. ధన్ తేరాస్ నుంచి దీపావళి వరకు మహాలక్ష్మి అమ్మవారికి ఏం సమర్పించినా.. అది రెట్టింపు అవుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు తమ శక్తి కొలదీ బంగారం, వెండిని అమ్మవారి పాదాల వద్ద సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా.. తమ కుటుంబంలో సుఖ శాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం. వారం రోజుల తర్వాత భక్తులు అమ్మవారికి సమర్పించిన బంగారం వెండిని తిరిగి అందజేస్తారు. ఇందుకోసం భక్తులు తమ గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వెండి, బంగారు నాణేలను ప్రసాదంగా ఇచ్చే ఈ ఆలయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Businessman: కోట్ల ఆస్తిని విరాళంగా రాసిచ్చి.. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిన కుటుంబం!