నేటికాలంలో సెల్ ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. రోజులో ఎక్కువ సమయం మొబైల్ తోనే గడుపుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కొందరు ఆలయాల్లో కూడా వాటిని ఉపయోగిస్తుంటారు. దైవ భక్తి కంటే వాటి మీద ఎక్కువ ఏకాగ్రత పెడుతుంటారు. అంతేకాక ఆలయ పరిసరాల్లో సెల్ఫీలు దిగుతూ ఇతర భక్తులకు ఇబ్బందులు కలిస్తుంటారు. ఈ నేపథ్యంలో తమిళనాడు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లోకి సెల్ ఫోన్ తీసుకువెళ్లడంపై నిషేధం విధిస్తున్నట్లు మద్రాస్ హైకోర్టు తెలిపింది. కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలనే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది.
తమిళనాడులోని టుటికోరిన్ జిల్లాలోని తిరుచెందూర్ లోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో సెల్ ఫోన్లను నిషేధించాలని కోరుతూ సీతారామన్ అనే భక్తుడు ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. భక్తులు తమ మొబైల్స్ లో దేవుళ్ల విగ్రహాలు, పూజలను ఫొటోలు తీస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది ఆగమాలకు విరుద్ధం కాబట్టి తిరుచెందూర్ ఆలయంలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలని పిటిషనర్ కోరాడు. అతడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు పై చాలా రోజుల పాటు విచారణ సాగింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భక్తి భావాలతో, స్వచ్ఛత, మతపరమైన పవిత్రతను కాపాడేందుకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో సెల్ ఫోన్ వినియోగం నిషేధించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆలయాల్లో భక్తి భావం, స్వచ్ఛత, మతపరమైన పవిత్రతను కాపాడేందుకు సెల్ ఫోన్ల నిషేధం అవసరమని కోర్టు విచారణ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది.
భక్తుల భద్రతతో పాటు ఆలయ పవిత్రతను కాపాడేందుకు, ఆలయ ప్రాంగణంలో సెల్ ఫోన్ వాడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తులు ఆర్.మహదేవన్, జస్టిస్ జె.సత్యనారాయణ ప్రసాద్ లు తెలిపారు. ఫోన్లు, కెమెరాల వినియోగం భక్తుల దృష్టిని మరల్చుతోందని న్యాయముర్తులు తెలిపారు. ఈ తీర్పును వెంటనే అమలు చేయాలని హిందూ మత, ధర్మాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పును అమలు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారిచేసినట్లు సమాచారం. స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
A person cannot carry his caste after conversion to another religion, observes Madras High Court while rejecting the backward class reservation claim of a man who converted to Islam from Hinduism.
— Live Law (@LiveLawIndia) December 2, 2022