నాయీ బ్రాహ్మణులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల పాలక మండళ్లలో ధర్మకర్తలుగా నాయీ బ్రాహ్మణులను నియమించేలా ఆర్డినెన్స్ జారీ చేసింది. దేవాదాయ శాఖ పరిధిలో 5 లక్షలకు పైబడి ఆదాయం సమకూరే ఆలయాల్లో మాత్రమే దేవాదాయ శాఖ ట్రస్టు బోర్డులను నియమించాలని ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు మేరకు.. 5 లక్షలకు పైన ఆదాయం సమకూరే 1234 దేవాలయాల్లో ట్రస్టు బోర్డులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటికే కొన్ని […]
పండగ సీజన్ లో ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంటుంది. మొన్న సంక్రాంతికి ఏపీకి వెళ్లే ప్రయాణికుల కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రథసప్తమి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడపనుంది టీఎస్ ఆర్టీసీ. ఈ నెల 28న రథసప్తమి సందర్భంగా భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు పడకూడదని.. వారి సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. […]
నేటికాలంలో సెల్ ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. రోజులో ఎక్కువ సమయం మొబైల్ తోనే గడుపుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కొందరు ఆలయాల్లో కూడా వాటిని ఉపయోగిస్తుంటారు. దైవ భక్తి కంటే వాటి మీద ఎక్కువ ఏకాగ్రత పెడుతుంటారు. అంతేకాక ఆలయ పరిసరాల్లో సెల్ఫీలు దిగుతూ ఇతర భక్తులకు ఇబ్బందులు కలిస్తుంటారు. ఈ నేపథ్యంలో తమిళనాడు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లోకి సెల్ ఫోన్ తీసుకువెళ్లడంపై నిషేధం విధిస్తున్నట్లు మద్రాస్ హైకోర్టు […]
మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 7-30 ప్రాంతంలో మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుతప్పి సాయి ధరమ్ తేజ్ కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ కి తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ప్రమాదం జరిగిన వెంటనే మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. తర్వాత అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాయి […]
ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు. అయితే ఆయన ఆ పదవి కోరుకోవడం లేదని తెలుస్తోంది. క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని వైవి సుబ్బారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే,సీఎం జగన్ మాత్రం ఆయనను రెండోసారి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ తాజా నిర్ణయంతో వైవి సుబ్బారెడ్డి మరోసారి టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్పొరేషన్ […]