శ్రీలంకలో అణచివేతకు గురికాబడుతున్న తమిళులకు స్వాతంత్ర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభాకరన్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE)ని స్థాపించాడు. త్రివిధ దళాలను ఏర్పాటు చేసి దాదాపు మూడున్నర దశబ్దాలు శ్రీలంక ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేశాడు. తాజాగా ప్రభాకరన్ బతికే ఉన్నారన్న వార్తలపై స్పందించిన శ్రీలంక ప్రభుత్వం..
శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం ఏర్పాటు చేసిన సంస్థ LTTE. ఈ వేర్పాటువాద సంస్థను 1976లో ప్రభాకరన్ స్థాపించాడు. గోరిల్లా యుద్దాలతో అప్పటి లంక ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేశాడు ప్రభాకరన్. అయితే అప్పటి లంక ప్రభుత్వం ప్రభాకరన్ ను ప్రత్యేక ఆపరేషన్ ద్వారా మట్టుబెట్టింది. అయితే మళ్లీ ఇన్ని సంత్సరాల తర్వాత ప్రభాకరన్ పేరు వార్తల్లో నిలిచింది. దానికి కారణం తమిళనాడు కాంగ్రెస్ మాజీ ఎంపీ పళ నెడుమారన్ చేసిన ప్రకటనే. ప్రభాకరన్ బతికే ఉన్నాడని, ఆయన త్వరలోనే బయటకి వస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు నెడుమారన్.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అటు శ్రీలంకలోనూ, ఇటు భారతదేశంలోనూ హాట్ టాపిక్ గా మారాయి. నెడుమారన్..”శ్రీలంక తమిళులకు విముక్తి కల్పించేందుకు ప్రభాకరన్ త్వరలోనే బయటకి వస్తారు. అయితే ఆయన ఎక్కడ ఉన్నారనే విషయం మాత్రం నేను మీకు చెప్పను. ఇక ప్రభాకరన్ బతికే ఉన్నారన్న విషయాన్ని ఆయన అనుమతితోనే మీకు చెబుతున్నాను. నేను ఇప్పటికీ ప్రభాకరన్ కుటుంబంతో మాట్లాడుతూనే ఉన్నాను. అయితే లంకలో ప్రస్తుతం రాజపక్సే కుటుంబం దిగిపోవడంతో.. ప్రభాకరన్ బయటకి వచ్చేందుకు ఇదే అనువైన సమయం అని ప్రభాకరన్ నాకు తెలిపారు. త్వరలోనే ఆయన తన ప్రణాళికలను వెళ్లడిస్తారు” అని పళ నెడుమారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే నెడుమారన్ ప్రభాకరన్ గురించి చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసింది శ్రీలంక ప్రభుత్వం. ప్రభాకరన్ బతికే ఉన్నాడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇక ప్రభాకరన్ మరణించినట్లు డీఎన్ ఏ ధృవీకరణ పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని శ్రీలంక డైరెక్టర్ మీడియా అండ్ ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ రవి హెరాత్ వెల్లడించారు. ఇక ఈ విషయంపై లంక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే ఉద్దేశం లేదని ఆయన పేర్కొన్నాడు. ఇక ఈ ప్రభాకరన్ వార్తలపై స్పందించాడు లంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ. ప్రస్తుతం ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాం, నివేదికలను పరిశీలించిన తర్వాతనే దీనిపై స్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇక 2009లో శ్రీలంక ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ లో ప్రభాకరన్ తన ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించి అప్పట్లో వీడియోలు, ఫోటోలు కూడా మీడియాలో ప్రచూరితం అయ్యాయి. అదీకాక ప్రభాకరన్ డీఎన్ఏ పరీక్షలు కూడా ప్రభాకరన్ మరణాన్ని నిజం అని తేల్చిచెప్పాయి. ఇక LTTE ని అణచివేయడానికి లంక ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చెలరేగాయి. అయితే ప్రభాకరన్ మరణించే నాటికి అతడి వయసు 54 సంవత్సరాలు కాగా.. అతడు మరణించి సుమారు 14 సంవత్సరాలు కావొస్తుంది. ఈ క్రమంలో ఇలాంటి ప్రకటన రావడం గమనార్హం. శ్రీలంకలో అణచివేతకు గురికాబడుతున్న తమిళులకు స్వాతంత్ర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభాకరన్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE)ని స్థాపించాడు.
பிரபாகரன் நலமுடன் உள்ளார். #Prabakaran #PazhaNedumaran pic.twitter.com/JRvDq1Px92
— 𝐀𝐣𝐞𝐞𝐭𝐡 𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚𝐬𝐚𝐦𝐲 (@AjeethK_) February 13, 2023