2011 వరల్డ్ కప్ ఫైనల్ ఆడాడు. ఐపీఎల్ లో ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడు. కానీ కట్ చేస్తే ఇప్పుడు బస్ డ్రైవర్ అవతారంలో కనిపించాడు. అతని పేరు ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు గాని శ్రీలంక క్రికెట్ లో ఒక స్పిన్నర్ గా కొన్ని సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగాడు.
ఎంత గొప్పగా బ్రతికినా కొన్నిసార్లు ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. కోట్లు సంపాదించినా సరే దురదృష్టం వెక్కిరిస్తే కిందకి రావాల్సిందే. ఇలాంటి సంఘటనలు చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. ప్రస్తుతం ఒక క్రికెటర్ పరిస్థితి అలాగే తయారైంది. ఆ క్రికెటర్ ఎవరో కాదు మాజీ శ్రీలంక స్పిన్నర్ సూరజ్ రందీవ్. వరల్డ్ కప్ ఫైనల్ ఆడాడు. అంతేకాదు ఐపీఎల్ లో ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహించాడు. అయితే రాజాల బ్రతికిన రందీవ్ ఇపుడు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతూ బ్రతుకుదెరువు కోసం ఇలా కొత్త అవతారంలో కనిపించాడు.
“సూరజ్ రందీవ్” ఈ పేరు ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు గాని శ్రీలంక క్రికెట్ లో ఒక స్పిన్నర్ గా కొన్ని సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగాడు. శ్రీలంక తరఫున 12 టెస్టుల్లో 43 వికెట్లు, 31 వన్డేల్లో 36 వికెట్లు తీసుకున్నాడు. 2010 నుంచి లంక తరఫున టీ20 ఆడిన రందీవ్ 7 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు కూడా తీశాడు. ఇంకా ధోనితో కలిసి చెన్నై తరఫున 8 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీశాడు.కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ చూడని రందీవ్..రిటైర్‌మెంట్ తర్వాత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న క్రికెటర్లు కూడా లేకపోలేదు. ఇదే కోవకు చెందుతాడు శ్రీలంక మాజీ ప్లేయర్ సూరజ్ రందీవ్. దేశం తరఫున వరల్డ్ కప్ ఆడిన ఈ ప్లేయర్.. రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత ఆస్ట్రేలియాలో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు.
2011 వరల్డ్ కప్ ట్రోఫీ కోసం భారత్‌తో తలపడిన ఫైనల్ మ్యాచులో శ్రీలంక టీమ్‌లో రందీవ్ కూడా సభ్యుడు. ఇక ఆ మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసిన రందీవ్ కేవలం 43 పరుగులే ఇచ్చి ఆకట్టుకున్నాడు. 2009లో టీమిండియాపై స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ స్థానంలో లంక తరఫున అరంగేట్రం చేసిన ఈ స్పిన్నర్.. 2016 వరకు జాతీయ జట్టు తరపున ఆడాడు. రిటైర్‌మెంట్ తర్వాత మెల్‌బోర్న్‌లోని ట్రాన్స్‌దేవ్ కంపెనీ బస్సు డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. విచారకరం ఏమిటంటే.. అదే కంపెనీలో మాజీ క్రికెటర్లు వాడింగ్టన్ మవైంగా(జింబాబ్వే), చింతక జయసింగ్(శ్రీలంక) కూడా ఉన్నారు.