ప్రస్తుత కాలంలో జరుగుతున్న మరణాల్లో ఎక్కువ రోడ్డు ప్రమాదల వలనే జరుగుతున్నాయి. అందులోనూ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో ప్రమాదలు ఎక్కువ జరుగుతున్నాయి.ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి జరిమానాలు కూడా విధిస్తుంటారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయిన కొందరిలో మార్పు రావటంలేదు. త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేసి వారితో పాటు ఇతరులను ప్రమాదాల బారిన పడ్డేస్తారు.
పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ఫలితం ఆశించిన స్థాయిలో కనిపించలేదనేది కొందరు ట్రాఫిక్ పోలీసుల అభిప్రాయం. అందుకే ట్రాఫిక్ పోలీసులు నిత్యం అనేక వినుత్న కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సమయంలో ట్రాఫిక్ ఓ వినుత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారో వారికి పెట్రోల్ ఫ్రీగా ఇస్తామని తెలిపారు. అది ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.
మరీ అది ఎక్కడో తెలుసుకుందాం… గుజరాత్ లోని వడోదర పోలీసులు ఈ పెట్రోల్ ఉచితం అనే కొత్త ఆలోచనను తీసుకొచ్చారు. “ట్రాఫిక్ ఛాంప్” అనే ఓ వినుత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారో వారిని గుర్తించి… వారికి రూ.100 పెట్రోలో ఉచితంగా ఇస్తారు. ఇలా రోజుకు 50 మందికి పెట్రోల్, డిజీల్ కూపన్స్ అందిస్తున్నారు వడోదర ట్రాఫిక్ పోలీసులు. ఈ ట్రాఫిక్ ఛాంప్ అనే కార్యక్రమం ఏడాది పాటు కొనసాగుతుందని గుజరాత్ హోం మంత్రి హర్షా సింఘ్వీ తెలిపారు. ఈ కార్యక్రమంతో అయిన ప్రజలో మార్పు వస్తుందని భావిస్తున్నామని వడోదర ట్రాఫిక్ ఎస్సై ఒకరు తెలిపారు. ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడటానికి ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Today’s *”Traffic Champ”* *Mr. Aditya Sarvaran*@sanghaviharsh@pkumarias@ashishbhatiaips@GujaratPolice@Shamsher_IPS#VadodaraCityPolice #i_m_traffic_champ pic.twitter.com/C4AkXb1vPT
— Vadodara City Traffic Police (@cp_traffic_vad) November 29, 2021