ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సరదానే వేరుగా ఉంటుంది. ఇక వారు అది కొనివ్వు.. ఇది కొనివ్వు.. అంటూ మారాం చేస్తూంటే మనకు ఒక్కోసారి కోపం.. ఒక్కోసారి నవ్వు వస్తుంది. అయితే అప్పుడప్పుడు మనం బజారుకు వెళ్తుంటాం. దాంతో పిల్లలు అక్కడ కనిపించిన ప్రతీ వస్తూవును కొనూ.. కొనూ.. అంటూంటారు. ఇక తినే వస్తువుల గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. కొనిచ్చినదాక వారు పట్టుపడుతూ.. ఏడుస్తూ ఉంటారు. దాంతో కరిగిపోయి మనం వారు అడిగింది కొనిస్తాం. అలాగే ఓ చిన్నారి తన తండ్రిని ఐస్ క్రీమ్ కొనిమ్మని అడిగింది. తన చిట్టితల్లి అడిగి కోరికను కాదనలేక ఆ తండ్రి ఐస్ క్రీమ్ షాప్ కు తీసుకెళ్లాడు.. అదే అతడు చేసిన పాపం అయ్యింది. అక్కడ జరిగిన విషాద సంఘటన తండ్రిని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
తల్లిదండ్రులు పిల్లలను ఎంతో గారాభంగా పెంచుతారు. ఇక వారికి ఏ చిన్న దెబ్బతగిలినా తల్లి ప్రాణం తల్లడిల్లి పోతుంది. అందుకే వారు ఏది అడిగినా కాదనకుంటా వెంటనే ఇస్తారు. ఎందుకంటే పిల్లలను ఏడింపించడం వారికి ఇష్టం ఉండదు కనుక. ఈ క్రమంలోనే మహారాష్ట్ర కు చెందిన ఓ వ్యక్తి తన నాలుగేళ్ల కూతురితో బజారుకి వచ్చాడు. నాసిక్ లోని త్రిమూర్తి చౌక్ లో ఓ ఐస్ క్రీమ్ షాప్ ఉంది. అటు వైపు చూసిన ఆ పాప తన తండ్రితో నాన్న నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడిగింది. తన చిట్టితల్లి అలా అడగడంతో కాదనలేక పోయిన తండ్రి పాపను తీసుకుని ఆ షాప్ లోకి వెళ్లాడు. అక్కడ ఫ్రిజ్ లో ఉన్న ఐస్ క్రీమ్ లను చూడడానికి పాప ఫ్రిజ్ ను పట్టుకుంది.
అప్పటికే దానికి కరెంట్ సరఫరా అవుతుండటంతో పాపకు కరెంట్ షాక్ కొట్టింది. దీనిని తండ్రి గమనించకుండా ఫొన్ లో మాట్లాడుతున్నాడు. పాప షాక్ తో కింద పడ్డాక తండ్రి గమనించాడు. ఏం జరిగిందో అర్థం కాక పాపను పక్కకి జరిపాడు. ఎంత లేపడానికి ప్రయత్నించినప్పటికీ పాప లేవలేదు. దీంతో వెంటనే ఆస్పత్రికి చిన్నారిని తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన వైద్య బృందం చిన్నారి అప్పటికే మరణించిందని తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఆ తండ్రి హృదయం ముక్కలైంది. కొన్ని క్షణాల క్రితమే తనతో ఆడి పాడి తిరిగిన తన చిట్టి తల్లి ఈ లోకంలో లేదని తెలిసే సరికి తట్టుకోలేక పోయాడు. పాపం తన బిడ్డ కోసం తల్లి ఇంటి దగ్గర వేచి చూస్తూ ఉంటుందని రోదించాడు. మరి ఈ హృదయ విదారక సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.