తండ్రి ఊళ్ళో వ్యవసాయం చేస్తుంటారు. కూతురు ఉద్యోగ రీత్యా నగరంలో ఉంటుంది. అద్దె ఇంట్లో ఒక్కర్తే ఉంటుంది. అయితే ఎవరూ లేని టైం చూసి..
ఏ తల్లిదండ్రులైనా పిల్లలే తమ ఆస్తులుగా భావిస్తారు. వయసు పెరిగినా కూడా పిల్లలు ఎప్పటికీ పిల్లలే. వారి మీద ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు. అలాంటిది పిల్లలకి ఏమైనా అయితే అస్సలు తట్టుకోలేరు. బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న శృతి నగరంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. ఒక్కర్తే ఉంటుంది. అయితే తన కూతురికి ఇలా జరుగుతుందని ఆమె తండ్రి అస్సలు ఊహించలేకపోయారు. నాన్న ఉండేది ఊళ్ళో. కూతురు ఉంటుంది నగరంలో. ఫోన్ లో మాట్లాడి దారుణాన్ని ఆపలేని పరిస్థితి. తెలివిగా బంధువులకు ఫోన్ చేసి చెప్పినా కానీ కాపాడలేని పరిస్థితి. బంధువులు శృతి ఇంటికి వెళ్ళేసరికే ఘోరం జరిగిపోయింది. అద్దె ఇంట్లో ఒక్కర్తే ఉండడం.. ఎవరూ లేని సమయం కావడం వల్ల దారుణం జరిగిపోయింది. అసలేం జరిగింది? శృతి ఎవరు? ఆమెకు ఏమైంది?
కర్ణాటక రాష్ట్రంలోని మండ్య నగరానికి చెందిన శృతి (30).. స్థానికంగా ఉన్న కావేరి గ్రామీణ బ్యాంకులో మేనేజర్. తండ్రి మల్లప్ప.. కొల్లేగల నివాసి. వ్యవసాయం చేస్తుంటారు. చిక్కమగళూరు బ్రాంచిలో ఏడేళ్లుగా పని చేసిన అనుభవం ఉంది శృతికి. మండ్యలోని ప్రాంతీయ కార్యాలయంలో రెండు నెలల క్రితమే మేనేజర్ గా చేరింది. మండ్యలోని వినాయక లేఅవుట్ లో అద్దె ఇంట్లో ఒక్కర్తే ఉంటుంది. తనకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న లక్ష్యం ఉంది. అది నెరవేరకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. గత రాత్రి 7 గంటల సమయంలో తండ్రికి ఫోన్ చేసి.. ‘చనిపోతున్నానని, తనను క్షమించండి నాన్న’ అని ఫోన్ పెట్టేసింది. తండ్రి షాకయ్యారు. కూతురికి వెంటనే కాల్ చేశారు. కానీ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది.
దీంతో శృతి తండ్రి మండ్యలో ఉంటున్న బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే శృతి ఇంటికి బంధువులు వెళ్ళేసరికే శృతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఒక సూసైడ్ నోట్ రాసుకుంది. ఐఏఎస్ అవ్వాలన్న తన కల నెరవేరకపోవడం వల్లే చనిపోతున్నాను అంటూ లేఖలో పేర్కొంది. మండ్య రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సివిల్స్ లో టాపర్ గా నిలిచి ఐఏఎస్ అవ్వాలని.. ఉన్నత స్థానంలో ఉండాలి అని అనుకున్న యువతి కల కలగానే మిగిలిపోయింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఐఏఎస్ అవ్వాలనుకున్న కల నెరవేరలేదు. తర్వాత ఉద్యోగ నియామకాల్లో ప్రతిభతో బ్యాంక్ ఉద్యోగం సంపాదించుకుంది. అయితే ఆ ఉద్యోగం తృప్తినివ్వకపోవడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఐఏఎస్ అవ్వాలన్న కల నెరవేరలేదని చనిపోయిన యువతికి.. ఆమె కళ్ళ ముందు వేలాడుతున్న కూతురు మృతదేహం కనబడుతుంటే ఆ తండ్రికి నిద్ర ఎలా పడుతుందో అన్న ఆలోచన రాకపోవడం బాధాకరం.