పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు. కానీ.., పేద వాడిగా చనిపోతే మాత్రం అది మన తప్పే. జాగ్రత్తగా గమనించి చూస్తే ఇది అక్షర సత్యం. కృషి, పట్టుదల ఉంటే చాలు. ఎంతటి పరిస్థితి నుండి అయినా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఈ విషయాన్ని నిజం చేసి చూపించాడు అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ ఎం. ధర్మరాజన్. ఈయన ఈరోజు అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ కావచ్చు. కానీ.. ఒకప్పుడు రోడుపై కాగితాలు ఏరుకునే స్థితిని అనుభవించారు. మరి.. అలాంటి జీవితం నుండి అందరి చేత సెల్యూట్ చేపించుకునే సూపర్ కాప్ గా ఎం. ధర్మరాజన్ ఎలా ఎదిగారో ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళ రాష్ట్రంలో కొల్లం ధర్మరాజన్ సొంత ఊరు. త్రిప్పునితురలోని RLV స్కూల్ లో 7 వ తరగతి వరకు చదివాడు. ఈ సమయంలో రైల్వే ట్రాక్ పై పడ్డ ప్లాస్టిక్ గ్లాసులు సేకరించేవాడు. అలా చేస్తే ఆయనకి రోజుకి 5 పైసలు వచ్చేవి. తరువాత ఇరుంపాణం హైస్కూల్ లో SSLC పూర్తి చేశాడు. కానీ.., అక్కడ 9వ తరగతి మూడుసార్లు చదివాడు. ఎందుకో తెలుసా? ఆ స్కూల్ లో మధ్యాహ్నం బోజన సదుపాయం ఉండేది. తాను 9వ క్లాస్ నుండి నుండి 10వ క్లాస్ కి ప్రమోట్ అయితే.. కచ్చితంగా పాస్ అవ్వాలి. అలా అయితే తనకి కూడా భోజనం పెట్టడం అమ్మకి కష్టం అవుతుంది అన్నది రాజన్ లెక్క. రాజన్ కి తండ్రి లేదు. నలుగురు పిల్లలతో వాళ్ల అమ్మ తెలిసిన వారింట్లో ఓ షెడ్ లో నివాసం ఉండేది. కాబట్టి.. తాను తల్లికి భారం కాకూడదు అనుకున్నాడు. ఈ కారణంగానే 9వ తరగతి మూడుసార్లు చదివి, పదో తరగతికి వచ్చాడు. SSLC లో మాత్రం రాజన్ కి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. మొదటి అటెంప్ట్ లోనే 10th పస అయ్యాడు.
ఆర్ధిక కష్టాలు, కుటుంబాన్ని చాకాల్సిన బాధ్యత రాజన్ పై పడింది. దీంతో.. ఆయన ఇంటర్ లో జాయిన్ అవ్వలేదు. బతకడానికి ఏ పని దొరికితే ఆ పని చేశాడు. కూలీ పనికి వెళ్ళాడు. సిగరెట్లు, ఛాక్లెట్స్, మజ్జిగ అమ్మాడు. అలాగే రైలు లెవల్ క్రాసింగ్ దగ్గర బట్టలు కూడా అమ్మాడు. కానీ.., బాగా చదువుకుని ఎదగాలన్న లక్ష్యాన్ని మాత్రం మరచిపోలేదు రాజన్. ఇందుకోసం ఎడతాలాలోని అల్-అమీన్ కళాశాలలో ప్రీ-డిగ్రీలో జాయిన్ అయ్యాడు. కానీ.., రోజు పనులు చేస్తూ చదువుకోవడం అతనికి కష్టంగా మారింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆ చదువును మద్యలోనే ఆపేశాడు. కానీ.., ఈసారి మళ్ళీ కూలి పనులకు వెళ్ళలేదు. పెద్ద లాయర్స్ దగ్గర గుమాస్తాగా చేరాడు. ఇదే రాజన్ జీవితాన్ని మలుపు తిప్పింది.
చదువుకున్న లాయర్స్ దగ్గర పని. వారు రాజన్ ని చదువుకోమని ఎంకరేజ్ చేశారు. అలా వారి దగ్గర పనిచేస్తూనే PSC పూర్తి చేశాడు రాజన్. 1999లో రాసిన టెస్ట్ లో ఈయన పాస్ అయ్యాడు. అలా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఎర్నాకులం దక్షిణ రైల్వే పోలీస్ స్టేషన్‌లో రాజన్ కానిస్టేబుల్ గా డిప్యుటేషన్‌పై మూడు సంవత్సరాల పాటు పని చేశారు. ఆ సమయంలో అలూవా-త్రిప్పునితుర ఎర్నాకులం లైన్‌లో బీట్ డ్యూటీ చేయటానికి వెళ్లినప్పుడు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాడు రాజన్. అదే పట్టాలపై 5 పైసాల కోసం పరుగులు పెట్టిన రోజులని తలుచుకునేవారు. ఇలా తన పేదరికాన్ని జయించి, జీవితంలో మంచి స్థాయికి వచ్చారు ధర్మరాజన్. కేరళ లో చాలా మంది యువతకి ఈయన జీవితమే ఓ ఆదర్శం. మరి.., జీవితంలో ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన ధర్మరాజన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.