జ్యోతి మౌర్య.. ఆమె వ్యక్తిగత విషయం హాట్ టాపిక్. భార్యపై ప్రేమతో ఆమె కోరిందల్లా తెచ్చాడు భర్త. చివరకు తనకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందనగానే..అందుకు ప్రిపరేషన్ ఇప్పించాడు. చివరకు తన కృషితో గవర్నమెంట్ ఉద్యోగాన్ని కొట్టింది. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అయ్యింది.
భార్యపై ప్రేమతో ఆమె కోరిందల్లా తెచ్చాడు భర్త. చివరకు తనకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందనగానే..అందుకు ప్రిపరేషన్ ఇప్పించాడు. చివరకు తన కృషితో గవర్నమెంట్ ఉద్యోగాన్ని కొట్టింది. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అయ్యింది. ఇక అక్కడ నుండి కథ అడ్డం తిరిగింది. భార్య మరో అధికారితో రాసలీలలు సాగించడం మొదలు పెట్టింది. ప్రశ్నిస్తే.. భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి.. ఊచలు లెక్కపెట్టేలా చేసింది. బెయిల్ పై తిరిగి వచ్చిన భర్త.. భార్య బాగోతాన్ని బయటపెట్టి గొల్లు మన్నాడు. కన్నీటి పర్యంతమయ్యాడు. అతడే ఉత్తరప్రదేశ్‍కు చెందిన అలోక్ మౌర్య. అతడి భార్య జ్యోతికి కోచింగ్ ఇప్పించి ఉన్నత స్థానంలో కూర్చొబెడితే.. చివరకు అతడికి ఈ గిఫ్ట్ ఇచ్చింది. ఈ వార్త ఇటీవల తెగ వైరల్ అయిన సంగతి విదితమే.
అయితే ఆడవాళ్ల కన్నీళ్లకే కాదూ మగవాళ్ల వేదనకు కూడా పవర్ ఫుల్ శక్తి ఉందా అంటే అవునని అనిపిస్తుంది ఈ వార్త. ప్రాణప్రదంగా ప్రేమించిన భర్తను కాలితో తన్ని, పరాయి పురుషుడితో కామకలాపాలు జరిపి, ఏ ఉద్యోగాన్ని చూసుకుని విర్రవీగిందో.. ఆ ఉద్యోగం ఊడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. సీనియర్ జిల్లా మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) జ్యోతి మౌర్యపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆమెను పదవి నుండి తొలగించారని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఇంతకు ఆ వార్త ఏంటంటే..? నిర్మాణ అనుమతిని ఆమోదించేందుకు ఆమె లంచం అడిగినట్లు స్థానిక నివాసి నుండి ఫిర్యాదు చేశారట. తొలుత నిర్మాణం చేపట్టేందుకు అనుమతించి.. ఆ తర్వాత రూ. 50 వేలు ఇవ్వాలని లంచం అడిగారని, దీంతో ముడుపులు ఇవ్వడం ఇష్టం లేని అతడు.. జిల్లా అధికార యంత్రాంగానికి దీనిపై ఫిర్యాదు చేశారని కథనం.
ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికార యంత్రాంగం విచారణ చేపట్టి.. ఆమె లంచం డిమాండ్ చేసినట్లు గుర్తించి ఉద్యోగం నుండి తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. తదుపరి విచారణ పెండింగ్‌లో ఉంచారని తెలుస్తోంది. కాగా, ఆమెను తొలగించారని వస్తున్న వార్తలపై అనేక మంది స్పందిస్తున్నారు. భర్తను మోసం చేసినందుకు తగిన శాస్తి జరిగిందని కొందరు భావిస్తుంటే.. అవినీతి చేపల్ని యుపి ప్రభుత్వం ఏరివేస్తుందని అంటున్నారు. ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వార్తలు అవాస్తవమని, ఆమెను ఉద్యోగం నుండి తొలగించలేదని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. ఆమెను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రాలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు.